ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాత్రికేయుల సంక్షేమ Board ఏర్పాటు

ABN, First Publish Date - 2021-12-04T14:31:46+05:30

రాష్ట్రంలో గుర్తింపు పొందిన పాత్రికేయులకు పలు సదుపాయాలు కల్పించే దిశగా పాత్రికేయుల సంక్షేమ బోర్డు ఏర్పాటైంది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసిందని సమాచార శాఖ మంత్రి మనో తంగరాజ్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                      - ప్రభుత్వ ఉత్తర్వు జారీ


చెన్నై: రాష్ట్రంలో గుర్తింపు పొందిన పాత్రికేయులకు పలు సదుపాయాలు కల్పించే దిశగా పాత్రికేయుల సంక్షేమ బోర్డు ఏర్పాటైంది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసిందని సమాచార శాఖ మంత్రి మనో తంగరాజ్‌ తెలిపారు. ఈ సంక్షేమ బోర్డు ద్వారా పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదివే పాత్రికేయుల పిల్లలకు రూ.1000ల నుంచి రూ.4000ల దాకా ఆర్థిక సాయం అందించనున్నారు. హాస్టల్‌లో ఉన్న పిల్లలకు కూడా రూ.1750లను చెల్లించనున్నారు. డిగ్రీ చదవుతున్న పిల్లలకు రూ.2 వేలు, హాస్టల్‌ కోసం రూ.3 వేలు, సాంకేతిక కోర్సుల్లో డిగ్రీ చదివేవారికి రూ.2 వేలు, హాస్టల్‌ ఫీజు రూ.4వేలు, ఇదే విధంగా వివాహ ఆర్థికసాయంగా రూ.2వేలు, ప్రసవ ఖర్చులకు రూ.6వేలు చెల్లించనున్నారు. పాత్రికేయులెవరైనా సహజంగా మృతిచెందితే రూ.50 వేలు ఆర్థికసాయంగా అందిస్తారు. అంత్యక్రియలకు రూ.5వేలను చెల్లించనున్నారు. ఈ కొత్త పాత్రికేయుల సంక్షేమ బోర్డు అధ్యక్షుడిగా సమాచారశాఖ మంత్రి మనో తంగరాజ్‌ అధ్యక్షుడిగా 13 మంది సభ్యులుగా ఉంటారని ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. ఈ బోర్డులో ఇద్దరు ఉద్యోగులను కూడా నియమించనున్నారు.

Updated Date - 2021-12-04T14:31:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising