ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌లో ట్రయల్స్‌కు జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ దరఖాస్తు

ABN, First Publish Date - 2021-04-21T07:44:05+05:30

సింగిల్‌ డోసు కరోనా వ్యాక్సిన్‌ ‘జాన్సెన్‌’తో భారత్‌లో మూడోదశ ప్రయోగ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతులు కోరుతూ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీ డ్రగ్స కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)కు సోమవారం దరఖాస్తు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 20: సింగిల్‌ డోసు కరోనా వ్యాక్సిన్‌ ‘జాన్సెన్‌’తో భారత్‌లో మూడోదశ ప్రయోగ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతులు కోరుతూ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీ డ్రగ్స కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)కు సోమవారం దరఖాస్తు చేసుకుంది. టీకా డోసుల ను భారత్‌కు దిగుమతి చేసేందుకు కూడా లైసెన్సును మంజూరు చేయాలని కోరింది. సాధ్యమైనంత త్వరగా కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్ర ణ సంస్థ (సీడీఎ్‌ససీవో)కు చెందిన నిపుణుల కమిటీ సమావేశమై తమ దరఖాస్తుపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. కాగా, అమెరికాలో ఈ వ్యాక్సిన్‌ తీసుకున్న పలువురిలో తలెత్తిన రక్తం గడ్డకట్టిన దుష్ప్రభావాలపై ఐరోపా ఔషధ సంస్థ (ఈఎంఏ) మంగళవారం స్పందించింది. వాటి కి జాన్సెన్‌ వ్యాక్సిన్‌తో సంబంధం ఉండొచ్చని పేర్కొంది. రక్తం గడ్డకడుతున్న అంశానికి సంబంధించిన హెచ్చరికతో కూడిన లేబుల్‌ను వ్యాక్సిన్‌ పెట్టెపై ముద్రించాలని జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీకి సూచించింది. 


Updated Date - 2021-04-21T07:44:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising