ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Johnson & Johnson: పిల్లలకు సింగిల్ డోస్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కోసం దరఖాస్తు

ABN, First Publish Date - 2021-08-20T17:09:18+05:30

దేశంలో 12 నుంచి 17 ఏళ్ల వయసుగల పిల్లలకు జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) ఆమోదం లభించింది.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : అమెరికా ఫార్మా దిగ్గజమైన జాన్సన్ అండ్ జాన్సన్ 12-17 సంవత్సరాల వయస్సు గల కౌమారదశ పిల్లలకు కొవిడ్ -19కి వ్యతిరేకంగా సింగిల్ షాట్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి అనుమతి కోరుతూ భారతదేశంలోని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్‌సిఓ)కి దరఖాస్తు చేసింది. జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేసిన సింగిల్ షాట్ కొవిడ్ వ్యాక్సిన్ మూడవదశలో కొవిడ్ నివారించడంలో 85 శాతం సామర్ధ్యం చూపించింది.దీంతో జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోసు వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి కోరింది.


కరోనా మహమ్మారిని అంతం చేయడంలో సహాయపడటానికి కొవిడ్ -19 వ్యాక్సిన్ ముఖ్యమైన ముందడుగు అని జాన్సన్అండ్ జాన్సన్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.‘‘18 సంవత్సరాల వయస్సులోపు వారిలో కొవిడ్‌ను నివారించడానికి జాన్సన్ అండ్ జాన్సన్ కొవిడ్ -19 సింగిల్-డోస్ టీకా అత్యవసర వినియోగానికి భారత ప్రభుత్వ అనుమతి కోసం దరఖాస్తు చేశాం’’ అని కంపెనీ ప్రతినిధి చెప్పారు.

Updated Date - 2021-08-20T17:09:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising