ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికా-రష్యా సంబంధాల్లో గొప్ప ముందడుగు : జో బైడెన్

ABN, First Publish Date - 2021-05-08T17:43:57+05:30

అమెరికా-రష్యా సంబంధాల్లో మంచి ముందడుగు పడబోతోందనే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్ : అమెరికా-రష్యా సంబంధాల్లో మంచి ముందడుగు పడబోతోందనే నమ్మకాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యక్తం చేశారు. వైట్ హౌస్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడినపుడు ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌తో తాను త్వరలోనే సమావేశం కాగలనని నమ్ముతున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి నిర్దిష్ట సమయం కానీ, స్థలం కానీ లేవన్నారు. వీటిపై చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు. 


రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌తో జూన్‌లో జో బైడెన్ సమావేశమవుతారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఓ విలేకరి ప్రస్తావించినపుడు జో బైడెన్ మాట్లాడుతూ, తాము త్వరలోనే సమావేశం కాగలమని నమ్ముతున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి నిర్దిష్ట సమయం కానీ, స్థలం కానీ లేవన్నారు. వీటిపై చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్-రష్యా సరిహద్దుల్లో రష్యా సైన్యాన్ని మోహరించడం వల్ల పుతిన్‌తో సమావేశమవ్వాలన్న తన ఉద్దేశంలో మార్పు ఉండదని చెప్పారు. 


‘‘ముఖాముఖి చర్చించాలన్న నా కోరికపై దాని ప్రభావం ఉండదు. సరిహద్దులో ఇంతకుముందు పుతిన్ దళాలు ఇంకా ఎక్కువగా ఉండేవి. ఆయన ఇప్పుడు దళాలను ఉపసంహరించుకున్నారు. అక్కడ ఇంకా రష్యా దళాలు ఉన్నాయి, అయితే ఓ నెల క్రితం ఉన్న దాని కన్నా తక్కువ దళాలు ఉన్నాయి’’ అని జో బైడెన్ పేర్కొన్నారు. 


వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ విలేకర్లతో మాట్లాడుతూ, జో బైడెన్, వ్లదిమిర్ పుతిన్ సమావేశం తేదీ, సమయం, ఎజెండాలపై చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు. అనేక అంశాలపై ఇరు దేశాల అనంగీకారం (ఏకాభిప్రాయం లేకపోవడం) కొనసాగుతుందన్నారు. ఈ అనంగీకారాలను ఇరు దేశాల అధ్యక్షుల సమావేశానికి ముందు పరిష్కరించుకోవలసిన అవసరం లేదన్నారు. 


బైడెన్ గతంలో మాట్లాడినపుడు జూన్‌లో తన యూరోపు పర్యటనలో పుతిన్‌తో సమావేశమవాలనుకుంటున్నట్లు తెలిపారు. బ్రిటన్‌లో జీ7 సమావేశంలో పాల్గొంటానని, ఆ సమయంలో తాను ఆయనను కలవాలనుకుంటున్నానని చెప్పారు. 


ఉక్రెయిన్, మానవ హక్కులు, సైబర్ సెక్యూరిటీ వంటివాటిపై రష్యా, అమెరికా మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. రాజకీయ జోక్యం మితిమీరుతోందని ఇరు దేశాలు పరస్పరం ఆరోపించుకుంటున్నాయి. 


Updated Date - 2021-05-08T17:43:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising