ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదిలోనే బైడెన్ ఘోర తప్పిదాలు

ABN, First Publish Date - 2021-08-28T00:24:42+05:30

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ అత్యంత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ అత్యంత దారుణమైన తప్పు చేసింది. అమెరికాకు మద్దతిచ్చినవారి జాబితాను తాలిబన్ల చేతిలో పెట్టింది. ఈ తప్పిదాన్ని బైడెన్ వైట్ హౌస్ మీడియా సమావేశంలో అంగీకరించారు. 


తాజాగా వెల్లడైన కథనాల ప్రకారం, ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికాకు సహకరించిన ఆఫ్ఘన్ల వివరాలను, ఆ దేశంలోని అమెరికన్లు, గ్రీన్ కార్డు హోల్డర్ల వివరాలను అమెరికా అధికారులు తాలిబన్లకు అందజేశారు. వీరిని కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్ళడానికి అనుమతించాలని కోరుతూ ఈ జాబితాను సమర్పించారు. గత అనుభవాలు హెచ్చరిస్తున్నప్పటికీ అమెరికా ఈ విధంగా చేయడం ఘోర తప్పిదమని విమర్శలు వస్తున్నాయి. 


9/11 ఉగ్రవాద దాడి తర్వాత జరిగిన పోరులో అమెరికా దళాలకు, పాశ్చాత్య దేశాల దళాలకు సహకరించిన ఆఫ్ఘన్లను అత్యంత కిరాతకంగా వెంటాడి చంపిన చరిత్ర తాలిబన్లకు ఉందనే విషయం అమెరికా అధికారులకు తెలిసినప్పటికీ, ఈ విధంగా తన మద్దతుదారుల జాబితాను తాలిబన్ల చేతుల్లో పెట్టడం ఘోరమైన తప్పు అని విమర్శలు వస్తున్నాయి. 


అమెరికా రక్షణ శాఖ అధికారి ఒకరు ఆ దేశ మీడియాతో మాట్లాడుతూ, అమెరికాకు మద్దతిచ్చినవారి జాబితాను తాలిబన్లు రూపొందించుకున్నారన్నారు. ఈ విధంగా అమెరికా తన మద్దతుదారుల జాబితాను తాలిబన్ల చేతుల్లో పెట్టడం అత్యంత దిగ్భ్రాంతికరం, భయానకం అని చెప్పారు. 


అలా జరిగి ఉండొచ్చునంటున్న బైడెన్

కాబూల్ విమానాశ్రయం వద్ద గురువారం జరిగిన ఉగ్రవాద దాడులపై విలేకర్ల సమావేశంలో జో బైడెన్ స్పందించారు. తాలిబన్లకు ఇచ్చిన జాబితా గురించి మాట్లాడుతూ, అమెరికన్ మిలిటరీ కొన్నిసార్లు తాలిబన్లను సంప్రదించారని తెలిపారు. ఉదాహరణకు, ‘‘కొందరు వ్యక్తులతో ఈ బస్సు వస్తోంది.  ఫలానావారు ఈ బస్సులో ఉన్నారు’’ అని చెప్పారన్నారు. అటువంటివి జరిగాయన్నారు. అయితే పేర్లతో కూడిన జాబితాను సమర్పించారని తాను కచ్చితంగా చెప్పలేనని తెలిపారు. ఒకవేళ అలాంటిది ఉంటే ఉండవచ్చునని, అయితే అలాంటి పరిస్థితి లేదని చెప్పారు. దాని అర్థం అలాంటిదేమీ లేదని కాదన్నారు. ‘‘ఇవిగో 12 మంది పేర్లు, వారు వస్తున్నారు. వారిని వెళ్ళనివ్వండి.’’ ఇలాంటివి జరిగి ఉండవచ్చునన్నారు. 


ప్రతి ఇంట్లో తాలిబన్ల సోదాలు

అమెరికా మిత్ర పక్షాల దళాలకు సహకరించిన ఆఫ్ఘన్ల కోసం తాలిబన్ డెత్ స్క్వాడ్స్ ప్రతి ఇంట్లోనూ సోదాలు చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాబూల్ విమానాశ్రయం వెలుపల భద్రత కోసం అమెరికా తాలిబన్లపై ఆధారపడుతోంది. 


ఆగస్టు 15 నుంచి తాలిబన్ల చేతికి జాబితాలు

ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఎవరెవరిని తరలించాలనుకుంటున్నదీ తెలియజేస్తూ తాలిబన్లకు జాబితాలను ఇచ్చే ప్రక్రియను అమెరికన్ దళాలు ఆగస్టు 15 నుంచి ప్రారంబించినట్లు అమెరికన్ మీడియా తెలిపింది. అమెరికాకు ఈ పరిస్థితి రావడానికి కారణాన్ని ఓ అధికారి వివరిస్తూ, కాబూల్ విమానాశ్రయం వెలుపల అన్ని అంశాలను నియంత్రించేందుకు తాలిబన్లకు అమెరికా అవకాశం ఇచ్చిందని, ఈ పరిస్థితిని అమెరికాయే సృష్టించిందని మండిపడ్డారు. 


Updated Date - 2021-08-28T00:24:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising