ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌తో దృఢమైన బంధం

ABN, First Publish Date - 2021-10-29T15:39:46+05:30

భారత్‌-జర్మన్‌లది దృఢమైన బంధమని చెన్నైలోని ఆ దేశ రాయబారి కరిన్‌ స్టోల్‌ పేర్కొన్నారు. సునామీ అనంతరం తీవ్రంగా నష్టపోయిన నాటపట్టినం చుట్టుపక్కల ప్రాంతాల బాధిత ప్రజలను ఆదుకునేందుకు, వారికి వృత్తి నైపుణ్య శి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                           - జర్మన్‌ రాయబారి కరిన్‌ స్టోల్‌


చెన్నై(Chennai): భారత్‌-జర్మన్‌లది దృఢమైన బంధమని చెన్నైలోని ఆ దేశ రాయబారి కరిన్‌ స్టోల్‌ పేర్కొన్నారు. సునామీ అనంతరం తీవ్రంగా నష్టపోయిన నాటపట్టినం చుట్టుపక్కల ప్రాంతాల బాధిత ప్రజలను ఆదుకునేందుకు, వారికి వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ఆ పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేకకేంద్రాన్ని కరిన్‌ స్టోల్‌ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఆ కేంద్రం పనిచేస్తున్న తీరును, అక్కడ శిక్షణ పొంది జీవితాలను మెరుగుపరచుకున్న వారి విశేషాలను తెలుసుకున్నారు. అక్కడ శిక్షణ పొందుతున్నవారితోనూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. శిక్షణా కేంద్రంలోని తరగతి గదులను పరిశీలించారు. శిక్షణలో భాగంగా విద్యార్థులు రూపొందించిన ఆవిష్కరణలను ఆమె ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇక్కడి సాంకేతికత, ప్రతిభలను భారత్‌-జర్మనీ ఉమ్మడి దృష్టిలో పెట్టుకుని సమగ్రాభివృద్ధికి పంచుకున్నాయన్నారు. ఈ ఉమ్మడి దృష్టి బారత్‌తో వున్న బంధానికి బలమైన ప్రతిబింబమన్నారు. ఇప్పటివరకూ ఈ కేంద్రంలో వెయ్యిమంది శిక్షణ పొంది జీవనోపాధి పొందుతున్నట్టు తెలిసి సంతోషంగా వుందన్నారు. 

Updated Date - 2021-10-29T15:39:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising