ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జనవరి 15లోగా Covid బాధితులందరికీ పరిహారం

ABN, First Publish Date - 2021-12-27T18:43:11+05:30

కొవిడ్‌ బారిన పడి మృతిచెందిన వారి కుటుంబాలకు 2022 జనవరి 15లోగా న ష్టపరిహారం అందించేందుకు ప్రయత్నిస్తానని అబ్కారీ శాఖ మంత్రి కే గోపాలయ్య ప్రకటించారు. తన నియోజకవర్గం మహాలక్ష్మి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                      - మంత్రి గోపాలయ్య


బెంగళూరు: కొవిడ్‌ బారిన పడి మృతిచెందిన వారి కుటుంబాలకు 2022 జనవరి 15లోగా న ష్టపరిహారం అందించేందుకు ప్రయత్నిస్తానని అబ్కారీ శాఖ మంత్రి కే గోపాలయ్య ప్రకటించారు. తన నియోజకవర్గం మహాలక్ష్మి లేఅవుట్‌లోని నాగపుర వార్డులో ఆదివారం ఆయన కొవిడ్‌కు బలైన 105 మంది వారసులకు నష్టపరిహారం చెక్కులను అందజేశారు. బీపీఎల్‌ కార్డులు కలిగిన వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. లక్ష, కేంద్రం ప్రకటించిన రూ. 50 వేలను  కలిపి ఒక్కో కుటుంబానికి రూ. 1.5 లక్షల పరిహారం చెక్కును అందజేశారు. కాగా ఏపీఎల్‌ కార్డులు కలిగిన వారికి కేంద్రం ప్రకటించిన రూ.50 వేల నష్టపరిహారం చెక్కును అందించారు. కొవిడ్‌ కారణంగా ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాల సభ్యులకు ఆయన స్వాంతన పలికారు. కొవిడ్‌ తీవ్రత వేళ తన నియోజకవర్గంలో 7వేల మందికి మెడికల్‌ కిట్లు అందించానని, వైద్యుల సలహా మేరకు 350 ఆక్సిజన్‌ సిలెండర్లను అందించామని, 100 కాన్సట్రేటర్లను సొంత ఖర్చుతో కొనుగోలు చేసి సమకూర్చానని మంత్రి వెల్లడించారు. కిడ్నీ సమస్యతో అలమటిస్తున్న వారికోసం నియోజకవర్గంలో ఉచిత డయాలసిస్‌ కేంద్రాన్ని నిర్వహిస్తున్నామని, దీని నిర్వహణకు గాను ప్రతి నెలా రూ.7.5 లక్షలను ఖర్చుపెడుతున్నామని మంత్రి వివరించారు. నియోజకవర్గంలో ప్రజల ఆరోగ్య సంరక్షణకు తొలి ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2021-12-27T18:43:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising