ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Apple Anti-Harassment: ఉద్యమించిన ఉద్యోగి తొలగింపు

ABN, First Publish Date - 2021-10-16T18:39:33+05:30

ఆపిల్ కంపెనీలో వివక్ష, వేధింపులకు వ్యతిరేకంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శాన్‌ఫ్రాన్సిస్కో : ఆపిల్ కంపెనీలో వివక్ష, వేధింపులకు వ్యతిరేకంగా గళమెత్తిన ఉద్యోగిని జన్నెకె పరిష్‌పై ఆ కంపెనీ కఠిన చర్యలు తీసుకుంది. కంపెనీ ఎక్విప్‌మెంట్ నుంచి మెటీరియల్‌ను తొలగించారని, కంపెనీ టౌన్ హాల్‌ను మీడియాకు అక్రమంగా వెల్లడించారని ఆరోపిస్తూ ఆమెను ప్రోగ్రామ్ మేనేజర్ పదవి నుంచి తొలగించింది. ఈ ఆరోపణలను ఆమె ఖండించారు. 


జన్నెకె పరిష్ అమెరికన్ మీడియాతో మాట్లాడుతూ, తాను పని చేసే చోట జరుగుతున్న అక్రమాలపై గళమెత్తానని చెప్పారు. తాను కంపెనీ ఎక్విప్‌మెంట్ నుంచి మెటీరియల్‌ను తొలగించానని ఆరోపిస్తూ, తనను ప్రోగ్రామ్ మేనేజర్  ఉద్యోగం నుంచి తొలగించారని తెలిపారు. కంపెనీ టౌన్ హాల్‌ను మీడియాకు అక్రమంగా వెల్లడించినట్లు ఆరోపిస్తూ దర్యాప్తు జరుపుతున్నారని తెలిపారు. ఈ దర్యాప్తులో భాగంగా తన డివైసెస్‌ను కంపెనీకి అప్పగించడానికి ముందు వాటిలోని తన వ్యక్తిగత సమాచారాన్ని తాను డిలీట్ చేశానన్నారు. 


వర్క్‌ప్లేస్‌లో తాను యాక్టివిజంతో వ్యవహరిస్తున్నందువల్లే తనను ఉద్యోగం నుంచి ఆపిల్ యాజమాన్యం తొలగించిందని ఆరోపించారు. కంపెనీలో జరుగుతున్న దుర్వినియోగాల గురించి మాట్లాడినందుకే తనపై ప్రతీకారం తీర్చుకుంటున్నట్లు స్పష్టమవుతోందన్నారు. వర్క్‌ప్లేస్ కండిషన్స్, వేతనాల చెల్లింపులో సమానత్వం వంటి అంశాలపై తాను గళమెత్తానన్నారు. తాను కంపెనీ నిబంధనలను చాలా జాగ్రత్తగా పాటించానని చెప్పారు. రహస్య సమాచారాన్ని తాను ఎన్నడూ వెల్లడించలేదని తెలిపారు. 


ఇదిలావుండగా, పాజిటివ్, సమ్మిళిత పని ప్రదేశాన్ని సృష్టించి, నిర్వహించేందుకు గట్టిగా కట్టుబడి ఉన్నట్లు ఆపిల్ కంపెనీ ప్రకటించింది. అమెరికా చట్టాల ప్రకారం, ఉద్యోగులు తమ వేతనాలు, పని పరిస్థితులు, సమాన వేతనాలు వంటి అంశాలపై బహిరంగంగా మాట్లాడుకోవచ్చు. 


మరోవైపు ఆపిల్ ప్రస్తుత, మాజీ ఉద్యోగులు ఇటీవల బహిరంగంగా తమ బాధలను చెప్పుకుంటున్నారు. తమపై జరుగుతున్న వివక్ష, వేధింపుల గురించి సామాజిక మాధ్యమాల్లో వివరిస్తున్నారు. పరిష్‌తోపాటు ఆమె కొలీగ్స్ కొందరు #ఆపిల్‌టూ హ్యాష్‌ట్యాగ్‌తో పోస్టులు పెడుతున్నారు. 


Updated Date - 2021-10-16T18:39:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising