ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు ఉద్యమానికి శరద్ పవార్ నాయకత్వం: ఎన్సీపీ

ABN, First Publish Date - 2021-01-20T02:14:29+05:30

సాగు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో తీవ్ర స్థాయిలో ఉద్యమం కొనసాగుతోంది. మిగతా రాష్ట్రాల్లో అత్యంత స్వల్పంగా ఈ ఉద్యమం ఉంది. మహారాష్ట్రతో పాటు దక్షిణాదికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న దీక్ష దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. జనవరి 26న ఢిల్లీలో పెద్ద సంఖ్యలో ట్రాక్టర్ ర్యాలీ చేపట్టనున్నట్లు రైతులు ఇప్పటికే ప్రకటించారు. దీనికి ఒక్క రోజు ముందు మహారాష్ట్ర రాజధాని ముంబైలో ర్యాలీ చేపట్టబోతున్నట్లు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మహారాష్ట్రలో కొన్ని రైతు సంఘాలతో కలిసి రాష్ట్రంలో అధికారంలో ఉన్న మహా వికాస్ అగాడీ ఈ ర్యాలీ చేపట్టనున్నట్లు ఆ పార్టీ పేర్కొంది. ఈ ర్యాలీకి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నాయకత్వం వహించనున్నారట.


‘‘సాగు చట్టాలకు వ్యతిరేకంగా ముంబైలోని ఆజాద్ మైదానంలో జనవరి 25న ర్యాలీ నిర్వహించబోతున్నాం. రాష్ట్రంలోని కొన్ని రైతు సంఘాలతో కలిసి చేపట్టనున్న ఈ ర్యాలీని మహా వికాస్ అగాడీ నిర్వహిస్తుంది. ఈ ర్యాలీకి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నాయకత్వం వహిస్తారు. ర్యాలీ రాజ్ భవన్ వైపుగా కొనసాగుతుంది. రైతులు చేస్తున్న ఉద్యమానికి మహా వికాస్ అగాడీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది’’ అని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ అన్నారు.


సాగు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో తీవ్ర స్థాయిలో ఉద్యమం కొనసాగుతోంది. మిగతా రాష్ట్రాల్లో అత్యంత స్వల్పంగా ఈ ఉద్యమం ఉంది. మహారాష్ట్రతో పాటు దక్షిణాదికి ఉద్యమ తీవ్రతను పెంచాలనే ఉద్దేశంతో ముంబైలో భారీ ర్యాలీకి ఎన్సీపీ పూనుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2021-01-20T02:14:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising