ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షార్ట్‌కట్స్ లేవు.. కష్టపడాలి.. క్రమద్ధీకరించాలి : జైరాం రమేశ్

ABN, First Publish Date - 2021-06-18T01:11:28+05:30

పార్టీ మొత్తాన్ని క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ అభిప్రాయపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : పార్టీ మొత్తాన్ని క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ అభిప్రాయపడ్డారు. ఇలా క్రమబద్ధీకరించిన తర్వాత దేశ వ్యాప్తంగా పార్టీని విస్తరిస్తే కాస్తలో కాస్త మెరుగైన ఫలితాలను సాధించవచ్చని పేర్కొన్నారు. ఓ జాతీయ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ‘‘పార్టీని క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉంది. ఓ క్రమపద్ధతిలో నాయకత్వాన్ని క్రమబద్ధీకరించాలి. ఏ నేత వద్దా అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదు. అందరూ పార్టీ కోసం కష్టించాల్సిందే’’ అని జైరాం రమేశ్ కుండబద్దలు కొట్టారు. వచ్చే ఎన్నికల నాటికి కొత్త మిత్రులను పార్టీ గుర్తించి, వారితో కలిసి పయనించాలని అన్నారు.


అలాగే పార్టీని వదిలి వెళ్లిపోయిన వారిపై తీవ్రంగా మండిపడ్డారు. వారందరికీ పార్టీ విశేష ప్రాచుర్యాన్ని, అవకాశాలను కల్పించిందని, అయినా పార్టీని వీడారని మండిపడ్డారు. వారు వెళ్లిపోయినా, చాలా మంది యువ కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. ఏ పార్టీలో అయినా కొన్ని పద్ధతులు ఉంటాయని, వాటిని ఉల్లంఘించి, వెళ్లిపోవడం సరైన పద్ధతి కాదని జైరాం అసహనం వ్యక్తం చేశారు. ఒకప్పుడు వారందరూ బీజేపీని విమర్శించారని, అలాంటి వారిని కూడా బీజేపీ ఇప్పుడు చేర్చుకుందని అన్నారు. సచిన్ పైలట్ కాంగ్రెస్‌కు గొప్ప ఆస్తి అని, ఆయనకు పార్టీలో బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉందని జైరాం అభిప్రాయపడ్డారు. 

Updated Date - 2021-06-18T01:11:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising