ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల శాంతి నిరసనను భగ్నం చేసే కుట్ర: దిగ్విజయ్ సింగ్

ABN, First Publish Date - 2021-01-27T21:14:03+05:30

బుధవారం ఆయన భోపాల్‌లో మీడియాతో మాట్లాడుతూ విధ్వంసానికి పాల్పడ్డ వారిలో 15 మందిని రైతులు పట్టుకున్నారని వారి మెడలో ప్రభుత్వ ఐడెంటిటీ కార్డులు ఉన్నాయని ఆయన వెల్లడించారు. వీరికి ప్రభుత్వ ఐడెంటిటీ కార్డులు ఎవరు ఇచ్చారని, ప్రభుత్వంలో ఎవరు ఉన్నారయని ఆయన ప్రశ్నించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్: రెండు నెలలుగా రైతులు శాంతి పూర్వకంగా చేస్తున్న నిరసను భగ్నం చేయడానికి కుట్ర పన్ని ట్రాక్టర్ పరేడ్‌లో విధ్వంసం సృష్టించారని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. బుధవారం ఆయన భోపాల్‌లో మీడియాతో మాట్లాడుతూ విధ్వంసానికి పాల్పడ్డ వారిలో 15 మందిని రైతులు పట్టుకున్నారని వారి మెడలో ప్రభుత్వ ఐడెంటిటీ కార్డులు ఉన్నాయని ఆయన వెల్లడించారు. వీరికి ప్రభుత్వ ఐడెంటిటీ కార్డులు ఎవరు ఇచ్చారని, ప్రభుత్వంలో ఎవరు ఉన్నారయని ఆయన ప్రశ్నించారు.


‘‘రైతుల ట్రాక్టర్ ర్యాలీ గురించి ముందుగానే అందరికీ తెలుసు. రైతులను ఢిల్లీలోకి మూడు రహదారుల ద్వారా ప్రవేశించేందుకు పోలీసులు అనుమతించారు. అయితే విచిత్రంగా ఘాజీపూర్ సరిహద్దు రహదారిలో పెద్ద ఎత్తున బారీకేడ్లు ఏర్పాటు చేసి రైతులను దారి మళ్లేలా చేశారు. అనంతరం దారి మళ్లిన రైతులపై టియర్ గ్యాస్‌లతో దాడికి దిగారు. ఆ తర్వాతే ఘర్షణ ప్రారంభమైంది. హింసాత్మక ఘటనకు పాల్పడ్డ వారిలో 15 మందిని రైతులు పట్టుకున్నారు. వారి మెడలో ప్రభుత్వ ఐడెంటిటీ కార్డులు ఉన్నాయి. ప్రభుత్వంలో ఉన్నది ఎవరో మీరే అర్థం చేసుకోండి (మీడియాను ఉద్దేశించి). శాంతియుతంగా జరుగుతున్న రైతుల నిరసనను భగ్నం చేసేందుకు కుట్ర జరిగిందని స్పష్టంగా తెలుస్తూనే ఉంది’’ అని దిగ్విజయ్ సింగ్ అన్నారు.

Updated Date - 2021-01-27T21:14:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising