ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పన్ను చెల్లింపుదారుల సేవలకు 3 ఈ-మెయిల్ ఐడీలు

ABN, First Publish Date - 2021-08-07T22:29:32+05:30

ఫేస్‌లెస్, ఈ-అసెస్‌మెంట్ స్కీమ్‌లో భాగంగా 3 ఈ-మెయిల్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఫేస్‌లెస్, ఈ-అసెస్‌మెంట్ స్కీమ్‌లో భాగంగా 3 ఈ-మెయిల్ ఐడీలను ఆదాయపు పన్ను శాఖ శనివారం నోటిఫై చేసింది. పన్ను చెల్లింపుదారులు వీటి ద్వారా తమ సమస్యలపై ఈ శాఖకు ఫిర్యాదు చేయవచ్చు. ట్యాక్స్ పేయర్స్ చార్టర్‌కు అనుగుణంగా సేవలను మరింత మెరుగుపరచడం కోసం వీటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. 


ఆదాయపు పన్ను శాఖ శనివారం ఇచ్చిన ట్వీట్‌లో, ట్యాక్స్ పేయర్స్ ఛార్టర్‌కు అనుగుణంగా పన్ను చెల్లింపుదారుల సేవలను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా, ఫేస్‌లెస్ స్కీమ్ క్రింద పెండింగ్ కేసులకు సంబంధించిన సమస్యలను నమోదు చేయడానికి ప్రత్యేకంగా ఈ-మెయిల్ ఐడీలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. 


ఆదాయపు పన్నుకు సంబంధించిన కార్యకలాపాల కోసం ట్యాక్స్ పేయర్ లేదా అసెసీ ఆదాయపు పన్ను శాఖ కార్యాలయాన్ని లేదా ఆ శాఖ అధికారిని ప్రత్యక్షంగా సంప్రదించవలసిన అవసరం ఉండదు. క్రింద పేర్కొన్న ఈ-మెయిల్ ఐడీల ద్వారా తమ సమస్యలను ఆ శాఖకు తెలియజేయవచ్చు. 


ఫేస్‌లెస్ అసెస్‌మెంట్ కోసం : samadhan.faceless.assessment@incometax.gov.in


ఫేస్‌లెస్ పెనాల్టీ కోసం : samadhan.faceless.penalty@incometax.gov.in


ఫేస్‌లెస్ అపీల్స్ కోసం : samadhan.faceless.appeal@incometax.gov.in


Updated Date - 2021-08-07T22:29:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising