ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంతర్జాతీయ మీడియా సంస్థలున్న భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు

ABN, First Publish Date - 2021-05-16T01:09:45+05:30

ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య రేకెత్తిన ఘర్షణలు యుద్ధాన్ని తలపిస్తున్నాయి. పరస్పరం రాకెట్ దాడులతో విరుచుకుపడుతున్నాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య రేకెత్తిన ఘర్షణలు యుద్ధాన్ని తలపిస్తున్నాయి. పరస్పరం రాకెట్ దాడులతో విరుచుకుపడుతున్నాయి. తాజాగా గాజా నగరంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో అంతర్జాతీయ మీడియా సంస్థలు కొలువైన 12 అంతస్తుల భవనం నేలమట్టమైంది. ఈ భవనంలో అసోసియేటెడ్ ప్రెస్, అల్-జజీరా సహా పలు అంతర్జాతీయ మీడియా హౌస్‌లు ఉన్నాయి. హమాస్ మిలిటెంట్లతో జరుగుతున్న ఈ పోరుపై నోరెత్తకుండా మీడియాను కట్టడి చేసే ఉద్దేశంతో ఈ దాడి జరిగినట్టు చెబుతున్నారు. 


భవనాన్ని ఖాళీ చేయాలని మిలటరీ ఆదేశించిన గంటలోనే ఈ దాడులు జరగడం గమనార్హం. మీడియా సంస్థలతోపాటు ఈ భవనంలో రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్లు కూడా ఉన్నాయి. దాడులు జరిగిన వెంటనే 12 అంతస్తుల భవనం క్షణాల్లో కుప్పకూలింది. అయితే, ఈ భవనంపై దాడి ఎందుకు చేయాల్సి వచ్చిందనేదానిపై ఇప్పటి వరకు ఎలాంటి వివరణ లేదు. భవనం కుప్పకూలడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన ధూళి, దుమ్ము, పొగ కమ్ముకుపోయింది. 


గాజాలోని శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 10 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. వీరిలో చాలామంది చిన్నారులున్నారు. ఆ వెంటనే ఇప్పుడీ దాడి జరగడం గమనార్హం. తొలుత జెరూసెలంలో చెలరేగిన ఘర్షణలు ఆ ప్రాంతం మొత్తానికి వ్యాపించాయి. యూదులు-అరబ్‌ల అల్లర్లు నగరాలకు విస్తరించాయి. ఇక, ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్‌బ్యాంకులో పాలస్తీనియన్లు నిన్న తీవ్రస్థాయిలో నిరసనలకు దిగారు. దీంతో ఇజ్రాయెల్ దళాలు 11 మందిని కాల్చి చంపాయి.     


సోమవారం హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పైకి వందలాది రాకెట్లను ప్రయోగించారు. కాగా, గాజాలో ఇప్పటి వరకు 139 మంది మరణించారు. వీరిలో 39 మంది చిన్నారులు, 22 మంది మహిళలు ఉన్నారు. ఇజ్రాయెల్‌లో 8 మంది మృత్యువాత పడ్డారు. గాజాలోని మీడియా హౌస్‌లు కొలువైన భవనంపై ఈ మధ్యాహ్నం దాడి జరిగింది. అంతకుముందు ఇజ్రాయెల్ మిలటరీ నుంచి భవన యజమానికి ఫోన్ వచ్చింది. అందులో ఉన్న అందరినీ ఖాళీ చేయించాలని, దానిని తాము కూల్చివేయబోతున్నామన్నది ఆ ఫోన్ సారాంశం. భవనాన్ని కూల్చివేసినప్పటికీ ఆల్ జజీరా మూగబోదని ఆ చానెల్ స్పష్టం చేసింది.  

Updated Date - 2021-05-16T01:09:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising