ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టిక్ టాక్ బ్యాన్‌పై పునఃసమీక్షించండి: పాక్ హైకోర్టు

ABN, First Publish Date - 2021-08-10T06:46:52+05:30

టిక్‌టాక్‌ను నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ(పీటీఏ)ని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్: టిక్‌టాక్‌ను నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ(పీటీఏ)ని ఇస్లామాబాద్ హైకోర్టు కోరింది. ప్రధాన న్యాయమూర్తి అతర్ మినల్లా దీనిపై మాట్లాడుతూ.. టిక్ టాక్‌పై ఆధారపడి చాలా మంది ఎంతో కొంత సంపాదించుకుంటున్నారని, అందువల్ల ఆ యాప్‌పై నిషేధం విధించడం సరైన చర్య కాదని, నిషేధంపై తిరిగి పరిశీలన చేయాలని సూచించారు. అంతేకాకుండా టిక్‌టాక్‌పై బ్యాన్ విధించే ముందు ఫెడరల్ గవర్నమెంట్ సూచనలను పీటీఏ తీసుకుందా..? అని కూడా విచారించారు. ఆగస్టు 23లోపు దీనిపై నివేదిక సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు.


కాగా.. ఇప్పటికే చైనాకు చెందిన షార్ట్ వీడియో అప్లికేషన్ టిక్‌టాక్‌.. పాకిస్తాన్‌లో నాలుగు సార్లు నిషేధానికి గురైంది. కొద్ది వారాల క్రితం నాలుగోసారి విధించిన నిషేధం ప్రస్తుతం కొనసాగుతోంది. అనుచితమైన కంటెంట్‌ను ప్రదర్శిస్తోందనే కారణంతో ఈ యాప్‌ను నిషేధిస్తున్నట్లు పీటీఏ పేర్కొంది. 

Updated Date - 2021-08-10T06:46:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising