ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్పీతో పొత్తుకు మరో పార్టీ సిద్ధం!

ABN, First Publish Date - 2021-11-23T23:39:14+05:30

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చాలా పార్టీలు పోటీలో ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీలే ప్రధాన పోటీ దారులుగా ఉన్నాయి. కాంగ్రెస్, ఆమ్‌ ఆద్మీ పార్టీలు ఒంటరిగా బరిలోకి దిగుతున్నప్పటికీ వాటి ప్రభావం అంతంత..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చాలా పార్టీలు పోటీలో ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీలే ప్రధాన పోటీ దారులుగా ఉన్నాయి. కాంగ్రెస్, ఆమ్‌ ఆద్మీ పార్టీలు ఒంటరిగా బరిలోకి దిగుతున్నప్పటికీ వాటి ప్రభావం అంతంత మాత్రంగానే ఉండనుంది. ఇక ఇతర చిన్న పార్టీలు ప్రధాన పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధపడుతున్నాయి. ఇప్పటికే ప్రధాని పార్టీల్లో ఒకటిగా ఉన్న సమాజ్‌వాది పార్టీతో సుహేల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ పొత్తు ఏర్పరుచుకుంది. కాగా మరోపార్టీ సైతం ఎస్పీతో జతకట్టేందుకు సిద్ధమైందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జయంత్ చౌదరి నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్‌ దళ్ (ఆర్‌ఎల్‌డీ) ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్‌తో కలిసి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. జయంత్ చౌదరితో కరచాలనం చేస్తున్న ఫొటోను అఖిలేష్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘‘మార్పు దిశగా జయంత్ చౌదరితో పాటు’’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరనుందంటూ అంచనాలు వెలువడుతున్నాయి. ఇది వాస్తవం రూపం దాల్చితే త్వరలోనే ఎస్పీ, ఎస్‌బీఎస్పీలతో ఆర్‌ఎల్‌డీ పొత్తులో భాగం కానుంది.

Updated Date - 2021-11-23T23:39:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising