ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Lakhimpur Kheri: పోలీసుల దర్యాప్తునకు హాజరైన ఆశిష్ మిశ్రా, ఇంటరాగేషన్ ప్రారంభం

ABN, First Publish Date - 2021-10-09T17:29:10+05:30

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన లఖింపూర్ ఖేరీ కేసులో నిందితుడైన కేంద్ర సహాయమంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా శనివారం ఉదయం 11 గంటలకు క్రైం బ్రాంచ్ పోలీసు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లఖింపూర్ ఖేరీ (ఉత్తరప్రదేశ్): దేశవ్యాప్తంగా సంచలనం రేపిన లఖింపూర్ ఖేరీ కేసులో నిందితుడైన కేంద్ర సహాయమంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా శనివారం ఉదయం 11 గంటలకు క్రైం బ్రాంచ్ పోలీసు కార్యాలయానికి వచ్చారు. లఖింపూర్ ఖేరీ ఘటనపై నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అశిష్ మిశ్రాను ఇంటరాగేట్ చేస్తోంది. తమ పోలీసు కార్యాలయానికి వచ్చిన ఆశిష్ మిశ్రాను విచారిస్తున్నామని యూపీ పోలీసు డీఐజీ ధ్రువీకరించారు. రైతులపై నుంచి కారు నడిపి చంపిన కేసులో ఆశిష్ మిశ్రా పోలీసు దర్యాప్తునకు రావాలని యూపీ పోలీసులు నోటీసు ఇచ్చారని దీంతో తన క్లయింట్ దర్యాప్తునకు వచ్చారని అతని న్యాయ సలహాదారు  అవదేష్ కుమార్ చెప్పారు. 


పోలీసుల నోటీసుపై స్పందించి దర్యాప్తులో తన క్లయింట్ సహకరిస్తారని అవదేష్ కుమార్ చెప్పారు. లఖింపూర్ ఖేరీ క్రైంబ్రాంచ్ పోలీసు కార్యాలయంలో దర్యాప్తు నకు కేంద్ర మంత్రి కుమారుడైన ఆశిష్ మిశ్రా హాజరు కావడంతో కార్యాలయం పరిసరాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కారుతో రైతులను ఢీకొట్టించి చంపిన కేసు నేపథ్యంలో కేంద్ర సహాయమంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరసన ప్రదర్శన జరిపారు. 


Updated Date - 2021-10-09T17:29:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising