ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మ‌నిషి కడుపులోని దాగున్న‌ బ్యాక్టీరియాతో క‌రోనాకు చికిత్స‌: నూత‌న అధ్య‌య‌నం

ABN, First Publish Date - 2021-06-22T18:01:14+05:30

ప్రపంచవ్యాప్తంగా క‌రోనా కేసులు కాస్త త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సియోల్‌: ప్రపంచవ్యాప్తంగా  క‌రోనా కేసులు కాస్త త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. ఇదే స‌మ‌యంలో క‌రోనాను అడ్డుకునేందుకు భారత్‌తో సహా అన్ని దేశాలలో టీకాలు వేస్తున్నారు. ఇటువంటి స‌మ‌యంలో  జ‌రిగిన ఒక అధ్యయనంలో కోవిడ్ -19 అంటువ్యాధికి పరిష్కారం మ‌నిషి కడుపులోనే ఉందని వెల్ల‌డ‌య్యింది. ఈ అధ్యయనంలో వెల్ల‌డైన వివ‌రాల‌ ప్రకారం మన కడుపులో ఉన్న ఒక‌ర‌క‌మైన బ్యాక్టీరియా కరోనాకు కారణమయ్యే సార్స్‌-కోవ్‌-2 వైర‌స్‌ను నివారిస్తుంద‌ని తేలింది. 


దక్షిణ కొరియాకు చెందిన యోన్సేయీ విశ్వవిద్యాలయం నిర్వ‌హించిన ఈ అధ్యయనంలో మనిషి ఉద‌రంలో ఉండే బ్యాక్టీరియా ఈ ప్రమాదకరమైన వైరస్‌తో పోరాడేందుకు స‌హాయ‌ప‌డుతుంద‌ని క‌నుగొన్నారు. ఈ బాక్టీరియం కరోనాకు కారణమయ్యే సార్స్‌-కోవ్‌-2 వైర‌న్‌ను నిరోధించే సమ్మేళనాన్ని ఉత్పత్తి చేస్తుందని పరిశోధకులు కనుగొన్నారు.  ఈ సంద‌ర్భంగా వ‌ర్శిటీ పరిశోధకుడు ముహమ్మద్ అలీ మాట్లాడుతూ కడుపులో ఉండే బిఫిడో బాక్టీరియం అనే బ్యాక్టీరియాలో క‌రోనాతో పోరాడే చ‌ర్య‌లు ఉండ‌వ‌చ్చ‌ని గుర్తించామ‌న్నారు. దీనిపై ఇంకా ప‌రిశోధ‌న‌లు సాగించాల్సివుంద‌ని తెలిపారు.

Updated Date - 2021-06-22T18:01:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising