ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నటి సుధా చంద్రన్‌కు అవమానం

ABN, First Publish Date - 2021-10-23T07:54:57+05:30

: ప్రఖ్యాత నృత్య కళాకారిణి, నటి సుధా చంద్రన్‌కు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అవమానం జరిగింది. తనిఖీల సమయంలో.. ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎయిర్‌పోర్టులో కృత్రిమ కాలును తొలగించమన్న వైనం, సీఐఎస్‌ఎఫ్‌ క్షమాపణలు

న్యూఢిల్లీ, అక్టోబరు 22: ప్రఖ్యాత నృత్య కళాకారిణి, నటి సుధా చంద్రన్‌కు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అవమానం జరిగింది. తనిఖీల సమయంలో.. అక్కడి సిబ్బంది ఆమె కృత్రిమ కాలును తొలగించాలని కోరారు. అందుకు ఇబ్బంది పడ్డ ఆమె.. ఈటీడీ (ఎక్స్‌ప్లోజివ్‌ ట్రేస్‌ డిటెక్టర్‌)తో తనిఖీ చేయాలని విజ్ఞప్తి చేశారు. వారు అంగీకరించకపోవడంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో తన కృత్రిమ కాలును తొలగించి చూపించారు. ఈ ఘటనపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. ‘‘మోదీజీ.. ఎయిర్‌పోర్టులో ఇలా జరగడం నాకు ఇదే తొలిసారి కాదు. ఈటీడీతో తనిఖీ చేయాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదు. నాలాగే కృత్రిమ భాగాలు అమర్చుకున్న ఎంతో మంది అనుభవిస్తున్న బాధ ఇది. దయచేసి నాలాంటి వాళ్లందరికీ ప్రత్యేకంగా గుర్తింపు కార్డులను అందించండి’’ అని సుధా చంద్రన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సెల్ఫీ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు. వీడియో వైరల్‌ కావడంతో సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎ్‌సఎఫ్‌) స్పందించింది. సుధా చంద్రన్‌కు క్షమాణలు చెప్పడంతో పాటు, ఈ ఘటన పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని ట్విటర్‌లో పేర్కొంది. 

Updated Date - 2021-10-23T07:54:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising