ఇన్స్టాగ్రామ్ యూజర్లకు షాక్.. యాప్ను ఉపయోగించాలంటే అది ఇవ్వాల్సిందే!
ABN, First Publish Date - 2021-09-01T01:45:22+05:30
ఇన్స్టాగ్రామ్ యూజర్లకు ఇది షాకింగ్ న్యూసే. ఇకపై యాప్ను వాడడం కొనసాగించాలంటే యూజర్లు
న్యూఢిల్లీ: ఇన్స్టాగ్రామ్ యూజర్లకు ఇది షాకింగ్ న్యూసే. ఇకపై యాప్ను వాడడం కొనసాగించాలంటే యూజర్లు తప్పకుండా తమ పుట్టిన రోజును షేర్ చేయాల్సి ఉంటుందని ఇన్స్టాగ్రామ్ స్పష్టం చేసింది. యూజర్లకు పూర్తి రక్షణ కల్పించే ఉద్దేశంతో తాము అభివృద్ధి చేస్తున్న ఫీచర్ను జోడిస్తే తప్పకుండా జన్మదినానికి సంబంధించిన సమాచారాన్ని పంచుకోవాల్సి ఉంటుందని తాజాగా ప్రకటించింది. ఇప్పటికే ఇలాంటి హెచ్చరిక స్క్రీన్లను మధ్యమధ్యలో చూపిస్తోంది. ఇకపై ఖాతా కొనసాగాలంటే ఖాతాదారులు తప్పకుండా తమ బర్త్ డేను షేర్ చేయాల్సిందేనని ఇన్స్టాగ్రామ్ తేల్చి చెప్పింది.
Updated Date - 2021-09-01T01:45:22+05:30 IST