ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగుల టీకా ఖర్చంతా మాదే.. ఇన్ఫోసిస్, యాక్సెంచర్ ప్రకటన

ABN, First Publish Date - 2021-03-04T02:13:51+05:30

కరోనా టీకాలకు సంబంధించి ప్రముక టెక్ సంస్థ ఇన్ఫోసిస్, కన్సల్టెన్సీ సంస్థ యాక్సెంచర్ బుధవారం నాడు కీలక ప్రకటన చేశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా టీకాలకు సంబంధించి ప్రముఖ టెక్ సంస్థ ఇన్ఫోసిస్, కన్సల్టెన్సీ సంస్థ యాక్సెంచర్ బుధవారం నాడు కీలక ప్రకటన చేశాయి. భారత్‌లో తమ ఉద్యోగులు టీకా వేసుకునేందుకు చేసే ఖర్చంతా తామే భరిస్తామని పేర్కొన్నాయి. ‘ఉద్యోగులకు టీకా వేసేందుకు వీలుగా ప్రైవేటు ఆస్పత్రులతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారం. ప్రస్తుత దశకు అర్హులైన ఉద్యోగులకు వారి కుటుంబసభ్యులకు టీకా అందేలా చర్యలు తీసుకుంటున్నాం’ అని ఇన్ఫోసిస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ రావ్ తెలిపారు. ఇతర ప్రముఖ సంస్థలైన మహీంద్రా అండ్ మహీంద్రా, ఐటీసీ కూడా తమ ఉద్యోగుల కోసం టీకాలు కొనుగోలు చేయాలా అనే దిశలో యోచిస్తున్నట్టు తెలుస్తోంది. 


ప్రస్తుతం కేంద్రం..కొవ్యాగ్జిన్, కోవీషీల్డ్ టీకాలను ప్రజలకు ఇచ్చేందుకు అనుమతిచ్చింది. సోమవారం నాడు ప్రారంభమైన రెండో దశ టీకా కార్యక్రమంలో 60 ఏళ్లు పైబడిన వారికి, 45 ఏళ్లకు పైబడి దీర్ఘకాలిక రోగాలతో సతమతమవుతున్న  వారికి టీకా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటూ ఎంపిక చేసిన ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ టీకా వేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కరోనా టీకా కావాలనుకున్న వారు ముందుగా..కొవిన్ పోర్టల్‌లో తమ పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 

Updated Date - 2021-03-04T02:13:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising