ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mysoor ల్యాంప్స్‌ భూముల్ని ప్రైవేటుకు అప్పగించే ప్రశ్నేలేదు

ABN, First Publish Date - 2021-12-15T17:47:13+05:30

బెంగళూరు మల్లేశ్వరంలో ఉన్న ప్రభుత్వరంగ సంస్థ మైసూరుల్యాంప్స్‌ వర్క్స్‌ లిమిటెడ్‌కు చెందిన భూములను ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రశ్నేలేదని భారీ పరిశ్రమల శాఖ మంత్రి మురుగేష్‌ నిరాణి స్పష్టం చేశారు. విధానపరిషత్‌లో మంగళవారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                - విధానపరిషత్‌లో మంత్రి మురుగేష్‌ నిరాణి స్పష్టీకరణ


బెంగళూరు: బెంగళూరు మల్లేశ్వరంలో ఉన్న ప్రభుత్వరంగ సంస్థ మైసూరుల్యాంప్స్‌ వర్క్స్‌ లిమిటెడ్‌కు చెందిన భూములను ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రశ్నేలేదని భారీ పరిశ్రమల శాఖ మంత్రి మురుగేష్‌ నిరాణి స్పష్టం చేశారు. విధానపరిషత్‌లో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో జేడీఎస్‌ సభ్యుడు కాంతరాజు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. మైసూరు ల్యాంప్స్‌ను 1996లో ప్రభుత్వం దివాళా పరిశ్రమగా ప్రకటించిందని అనంతరం 2002లో ఈ పరిశ్రమను శాశ్వతంగా మూసివేసేందుకు కార్మికశాఖ గ్రీన్‌ సిగ్నల్‌ మంజూరు చేసిందని మంత్రి సభకు వివరించారు. ఈ సంస్థకు చెందిన విలువైన 21 ఎకరాల భూమి సంరక్షణకుగాను ఈ ప్రదేశంలో బెంగళూరు ఎక్స్‌పీరియన్స్‌ ప్రాజెక్టును నిర్మించాలని తీర్మానిస్తూ 2020 డిసెంబరు 1న ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతిని ఆయన గుర్తుచేశారు. ఇందుకు గాను బెంగళూరు హెరిటేజ్‌, ఎన్విరాన్‌మెంట్‌ ట్రస్టును ఏర్పాటు చేసి 2021 మేలో రూ.10 కోట్లు విడుదల చేశారన్నారు. ఈ ప్రదేశంలో గ్రీన్‌బెల్ట్‌ను యథాతథంగా సంరక్షించి మిగిలిన ప్రదేశంలో మాత్రమే ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపడతామని మంత్రి సభకు వెల్లడించారు. మైసూరు ల్యాంప్స్‌కు చెందిన కోట్లాది రూపాయల విలువచేసే భూమిని ప్రైవే టు ఆసుపత్రికి కేటాయించబోతున్నట్లు వినిపిస్తున్న కథనాలు పూర్తిగా నిరాధారమని మంత్రి స్పష్టం చేశారు.

Updated Date - 2021-12-15T17:47:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising