ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన ఇందిరా శోభన్.. చోటా మోదీ కేసీఆర్ అంటూ సెటైర్

ABN, First Publish Date - 2021-12-25T19:42:15+05:30

రాజకీయ నాయకురాలు ఇందిరా శోభన్ నేడు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక సామాన్యుల పార్టీ అని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ : రాజకీయ నాయకురాలు ఇందిరా శోభన్ నేడు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక సామాన్యుల పార్టీ అని.. అందుకే తాను ఆ పార్టీలో చేరానన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాజకీయ ముఖచిత్రం మారిపోయిందన్నారు. ఒక సాధారణ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చానని... బీజేపీ, టీఆర్ఎస్ ఒకే గొడుగు కింద పని చేస్తున్నాయన్నారు. కేంద్రంలో బడా మోదీ, రాష్ట్రంలో చోట మోదీ కేసీఆర్ అంటూ ఇందిరా శోభన్ సెటైర్ వేశారు. బీజేపీ, టీఆర్ఎస్ రెండూ ఒకటేనన్నారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని, నాలుగు వేల స్కూల్స్ మూసివేశారన్నారు. మోదీని, బీజేపీని ఎదుర్కొనే ఏకైక పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ మాత్రమేనని ఇందిరా శోభన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందన్నారు. భవిష్యత్తులో చాలా మంది నేతలు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరనున్నారని వెల్లడించారు. షర్మిల పార్టీ తెలంగాణలో సరియైన ప్రభావాన్ని చూపించలేకపోతోందన్నారు. ఆ పార్టీని తెలంగాణలో ఎవ్వరూ నమ్మడం లేదని ఇందిరా శోభన్ పేర్కొన్నారు.

Updated Date - 2021-12-25T19:42:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising