ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుబాయ్ చెక్కేసిన భారత తొలి ‘ఒమైక్రాన్’ బాధితుడు!

ABN, First Publish Date - 2021-12-03T00:53:35+05:30

భారత్‌లో బయపడిన రెండు ఒమైక్రాన్ కేసుల్లోని బాధితుల్లో ఒకరు దుబాయ్ వెళ్లిపోయినట్టు కర్ణాటక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: భారత్‌లో బయటపడిన రెండు ఒమైక్రాన్ కేసుల్లోని బాధితుల్లో ఒకరు దుబాయ్ వెళ్లిపోయినట్టు కర్ణాటక అధికారులు తెలిపారు. కొవిడ్ నెగటివ్ ధ్రువీకరణ పత్రంతో ఈ నెల 20న బెంగళూరు చేరుకున్న 66 ఏళ్ల బాధితుడు వారం రోజుల తర్వాత అంటే గత నెల 27న విమానంలో దుబాయ్ వెళ్లిపోయినట్టు బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) అధికారులు తెలిపారు.

 

అతడికి ఇప్పటికే వ్యాక్సినేషన్ పూర్తయినట్టు అధికారులు పేర్కొన్నారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న అతడు హోటల్‌కు వెళ్లగా, అదే రోజు అతడికి కరోనా బారినపడ్డాడు. హోటల్‌ను సందర్శించిన అధికారులు అతడిని పరీక్షించి అసింప్టమాటిక్‌గా తేల్చారు. స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించారు. 

 

బాధితుడు ‘ఎట్-రిస్క్’ దేశం నుంచి రావడంతో అతడి నుంచి మరోమారు నమూనాలు సేకరించిన నవంబరు 22న జినోమ్  సీక్వెన్సింగ్‌ కోసం పంపారు. అతడితోపాటు ప్రయాణించిన మిగతా 24 మందిని పరీక్షించగా కరోనా నెగటివ్‌గా నిర్ధారణ అయింది. అలాగే, అతడి 240 మంది సెకండరీ కాంటాక్టులను కూడా పరీక్షించారు. వారికి కూడా కరోనా సోకలేదని నిర్ధారణ కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 


మరోవైపు, నవంబరు 23న బాధితుడు ఓ ప్రైవేటు ల్యా‌బ్‌లో పరీక్షించుకోగా నెగటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అదే నెల 27న అర్ధరాత్రి హోటల్ నుంచి బయటపడి కారులో విమానాశ్రయానికి చేరుకుని దుబాయ్ ఫ్లైట్ ఎక్కేసినట్టు అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-12-03T00:53:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising