ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీఎంకే కూటమిలో తొలి కేటాయింపు

ABN, First Publish Date - 2021-03-02T12:59:20+05:30

డీఎంకే కూటమిలో మిత్రపక్షాలుగా ఉన్న ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ (ఐయూఎంఎల్‌), మణిదనేయ మక్కల్‌ కట్చి (ఎంఎంకే)కు సీట్లు ఖరారయ్యాయి. సోమవారం సాయంత్రం డీఎంకే ప్రధాన కార్యాలయం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐయూఎంఎల్‌కు 3, ఎంఎంకేకు 2

చెన్నై/ప్యారీస్ (ఆంధ్రజ్యోతి): డీఎంకే కూటమిలో మిత్రపక్షాలుగా ఉన్న ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ (ఐయూఎంఎల్‌), మణిదనేయ మక్కల్‌ కట్చి (ఎంఎంకే)కు సీట్లు ఖరారయ్యాయి. సోమవారం సాయంత్రం డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ నేతృత్వంలో చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో రెండు పార్టీలకు సీట్ల కేటాయింపులు ఖరారయ్యాయి. ఈ మేరకు ఒప్పందపత్రాలపై ఇరుపార్టీల నేతలు, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఐయూఎంఎల్‌కు 3, ఎంఎంకేకు 2 సీట్లు కేటాయించారు.

నిచ్చెన గుర్తుపై పోటీ... : జాతీయ పార్టీగా ఉన్న ఐయూఎంఎల్‌ నిచ్చెన గుర్తుపై మూడు నియోజకవర్గాల్లో పోటీచేస్తుందని ఆ పార్టీ తమిళనాడు విభాగం అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ఖాదర్‌మొహిద్దీన్‌ మీడియాకు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయడానికి తమ పార్టీకి కేటాయించాల్సిన నియోజకవర్గాలపై ఆది, సోమవారాల్లో రెండు విడతల చర్చలు జరిగాయని, డీఎంకే కూటమిలో ఉన్న మిగతా పార్టీలకు కూడా సీట్లు కేటాయించాల్సిన పరిస్థితి నెలకొందని, ఇందువల్ల ఐదు సీట్లు కేటాయిస్తారని తాము కేటాయించిన మూడు సీట్లతో సర్దుకున్నామన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ తమకు కేటాయించిన నిచ్చెన గుర్తుపైనే పోటీచేస్తామని ఆయన తెలిపారు. అనంతరం ఎంఎంకే రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జవహిరుల్లా విలేఖరులతో మాట్లాడుతూ.. జరుగబోయే 2021 అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర తలరాత మారుస్తాయని, దేశంలోని పలు రాష్ట్రాల్లో బీజేపీ దిగజారుడు రాజకీయాలు సాగిస్తోందని ఆరోపించారు. తమ పార్టీకి కేటాయించిన రెండు స్థానాలతో పాటు అన్ని స్థానాల్లో కూటమి పార్టీలను గెలిపించేందుకు కృషిచేస్తామని, రాష్ట్ర హక్కులు కాపాడుకొనేందుకు ప్రజలు డీఎంకే కూటమిని గెలిపించాలని ఆయన పిలుపుని చ్చారు.

Updated Date - 2021-03-02T12:59:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising