ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కులభూషణ్‌కు అప్పీలు చేసుకునే హక్కు

ABN, First Publish Date - 2021-06-11T08:45:00+05:30

పాకిస్థాన్‌లో ఉరిశిక్షపడిన భారత ఖైదీ కులభూషణ్‌ జాదవ్‌కు అప్పీలు చేసుకునే హక్కు కల్పించేందుకు పాకిస్తాన్‌లోని నేషనల్‌ అసెంబ్లీ గురువారం ఒక బిల్లును ఆమోదించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • పాక్‌ నేషనల్‌ అసెంబ్లీ బిల్లు ఆమోదం

న్యూఢిల్లీ, జూన్‌ 10: పాకిస్థాన్‌లో ఉరిశిక్షపడిన భారత ఖైదీ కులభూషణ్‌ జాదవ్‌కు అప్పీలు చేసుకునే హక్కు కల్పించేందుకు పాకిస్తాన్‌లోని నేషనల్‌ అసెంబ్లీ గురువారం ఒక బిల్లును ఆమోదించింది. గూఢచర్యం, ఉగ్రవాద చర్యలతో సంబంధం ఉందన్న ఆరోపణలపై జాదవ్‌కు 2017లో పాకిస్తాన్‌ సైనిక కోర్టు ఉరి శిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీనిపై భారత్‌ హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా... కులభూషణ్‌కు విధించిన శిక్షపై స్టే ఇచ్చి కేసును పునర్విచారణ జరపాల్సిందిగా 2019లో పాకిస్తాన్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. జాదవ్‌కు దౌత్యపరమైన సాయం అందించాల్సిందిగా కూడా హేగ్‌ కోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో కులభూషణ్‌ అప్పీలు చేసుకునేందుకు వీలుగా నిరుడు ఇమ్రాన్‌ ఖాన్‌ సర్కారు నేషనల్‌ అసెంబ్లీలో ఆర్డినెన్స్‌ను ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించిన బిల్లు గురువారం ఆమోదం పొందింది. 


Updated Date - 2021-06-11T08:45:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising