ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాబుల్ ఎయిర్ పోర్టులో దారుణ పరిస్థితులు: అఫ్ఘానిస్థాన్‌ నుంచి వచ్చిన భారతీయలు!

ABN, First Publish Date - 2021-08-18T12:42:17+05:30

‘వంటలలో గన్‌పౌడర్ వాసనలు, వీధుల్లో విధ్వంసకర ఘటనలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ‘వంటలలో గన్‌పౌడర్ వాసనలు, వీధుల్లో విధ్వంసకర ఘటనలు, చనిపోతున్నామంటూ జనాల ఆక్రందనలు, వాహనాల రణగొణ ధ్వనులు, ఆయుధాలు ధరించిన తాలిబన్లు సాగిస్తున్న దారుణాలు... అఫ్ఘానిస్థాన్‌లో ప్రస్తుతం కనిపిస్తున్న దృశ్యాలివి.  ఇకముందు మరెన్ని చూడాల్సివస్తుందో...’  అఫ్ఘానిస్థాన్‌ నుంచి ప్రాణాలు చేతబట్టుకుని భారత్ వచ్చిన ప్రజల ఆవేదన ఇది. కాబుల్ నుంచి 120 మంది భారతీయులను తీసుకువచ్చిన గ్లోబ్ మాస్టర్ విమానం గుజరాత్‌లోని జామ్‌నగర్ లో ల్యాండ్ అయ్యింది. 


భారత్ చేరుకున్న వీరంతా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. తొలుత వీరిని గజియాబాద్‌లోని హిండన్ ఎయిర్ బేస్‌కు తరలించారు. అక్కడ వారికి తనిఖీలు నిర్వహించి వారి స్వస్థలాలకు పంపించనున్నారు. ఈ సందర్భంగా కొంతమంది భారతీయులు మీడియాతో మాట్లాడుతూ కాబుల్ ఎయిర్‌పోర్టు వద్ద పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయని వాపోయారు. తాలిబన్లు కాబుల్‌ను ఆక్రమించుకున్నాక అక్కడి సాధారణ పౌరులు ఎయిర్‌పోర్టులోనికి చేరుకున్నారు. వారంతా ఎయిర్‌క్రాఫ్ట్ కోసం ఎదురుచూస్తూ అక్కడే ఉంటున్నారు. కాబుల్ లో ఇప్పటికీ 300 మందికిపైగా భారతీయులు పలు అవస్థలు పడుతున్నారని, వారిని కూడా త్వరగా భారత్ రప్పించే ప్రయత్నం చేయాలని వారు ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

Updated Date - 2021-08-18T12:42:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising