ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇండియన్ నేవీ యుద్ధ నౌక తుషిల్ రష్యాలో జల ప్రవేశం

ABN, First Publish Date - 2021-10-30T02:04:29+05:30

భారత నావికా దళానికి చెందిన యుద్ధ నౌక తుషిల్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : భారత నావికా దళానికి చెందిన యుద్ధ నౌక తుషిల్ జల ప్రవేశం రష్యాలోని కలినిన్‌గ్రాడ్‌లో జరిగింది. ఇది క్రివాక్ లేదా తల్వార్ క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్ (వేగంగా ప్రయాణించే చిన్న నౌక). ఇది రష్యాలో తయారవుతోంది. 4 ఫ్రిగేట్ల తయారీకి భారత్, రష్యా కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా దీనిని రష్యా తయారు చేసింది. ఈ ఒప్పందం ప్రకారం రెండు నౌకలను రష్యాలో తయారు చేస్తారు, మరో రెండిటిని టెక్నాలజీ బదిలీ ద్వారా భారత దేశంలో తయారు చేస్తారు. 


నౌకను డ్రై డాక్ నుంచి జలాల్లోకి ప్రవేశపెట్టడం చాలా ముఖ్యమైన సంఘటన. మౌలిక నిర్మాణం పూర్తయిన తర్వాత జల ప్రవేశం చేయిస్తారు. నౌక జలాల్లో ఉండగా అడ్వాన్స్‌డ్ కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. నౌకకు ఆయుధాలు తదితరాలను అమర్చుతారు. 


భారత నావికా దళం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, పీ1135.6 క్లాస్‌కు చెందిన ఏడో భారత నావికా దళ ఫ్రిగేట్ అక్టోబరు 28న రష్యాలోని కలినిన్‌గ్రాడ్, యంతర్ షిప్‌యార్డులో జరిగింది. రష్యాకు భారత రాయబారి డీ బాల వెంకటేశ్ వర్మ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ నౌకకు తుషిల్ అని దాట్ల విద్య వర్మ అధికారికంగా పేరు పెట్టారు. తుషిల్ అనేది సంస్క‌ృత పదం. దీని అర్థం రక్షణ కవచం. 


ఈ కాంట్రాక్టులో భాగంగా మొదటి నౌక 2023లో భారత దేశానికి వచ్చే అవకాశం ఉంది. కోవిడ్ మహమ్మారి వల్ల దీని నిర్మాణంలో సుమారు ఎనిమిది నెలలపాటు జాప్యం జరిగింది. రెండు ఫ్రిగేట్ల ప్రాథమిక నిర్మాణం యంతర్ షిప్‌యార్డులో సిద్ధంగా ఉంది. 


Updated Date - 2021-10-30T02:04:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising