ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆకలి సూచీ Survey అశాస్త్రీయం : భారత్

ABN, First Publish Date - 2021-10-16T02:03:07+05:30

ప్రపంచ ఆకలి సూచీలో భారత దేశ ర్యాంకును తగ్గించడం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ప్రపంచ ఆకలి సూచీలో భారత దేశ ర్యాంకును తగ్గించడం పట్ల కేంద్ర ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ అధ్యయనంలో అనుసరిస్తున్న విధానం అశాస్త్రీయమైనదని మండిపడింది. ఈ నివేదికను ప్రచురించిన కన్సర్న్ వరల్డ్‌వైడ్, వెల్ట్ హంగర్‌హిల్ఫే సంస్థలు తగిన జాగ్రత్తలు పాటించలేదని ఆరోపించింది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో 2020లో భారత్ 94వ స్థానంలో ఉండేది, 2021లో 101వ స్థానానికి దిగజారింది. 116 దేశాలను అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించారు.


గ్లోబల్ హంగర్ ఇండెక్స్, 2021 నివేదికపై కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఘాటుగా స్పందించింది. ఈ నివేదికలో భారత దేశ ర్యాంకును తగ్గించడం దిగ్భ్రాంతికరమని పేర్కొంది. పోషకాహార లోపంగల జనాభా దామాషాపై ఎఫ్ఏఓ అంచనా ఆధారంగా ఈ ర్యాంకును ఇచ్చారని పేర్కొంది. ఎఫ్ఏఓ అంచనా విధానం క్షేత్ర స్థాయి వాస్తవాలకు దూరంగా ఉంటుందని, తీవ్రమైన విధానపరమైన సమస్యలు ఉన్నాయని వెల్లడైందని తెలిపింది. ఈ నివేదికను విడుదల చేయడానికి ముందు ప్రచురణకర్తలైన కన్సర్న్ వరల్డ్‌వైడ్, వెల్ట్ హంగర్‌హిల్ఫే తగిన జాగ్రత్తలను పాటించలేదని పేర్కొంది. ఎఫ్ఏఓ అనుసరించిన విధానం అశాస్త్రీయమైనదని తెలిపింది. 


నాలుగు ప్రశ్నల ఒపీనియన్ పోల్ ఆధారంగా ఈ అంచనా వేశారని పేర్కొంది. ఈ పోల్‌ను టెలిఫోన్ ద్వారా గాలప్ నిర్వహించిందని తెలిపింది. తలసరి ఆహార ధాన్యాల లభ్యత వంటి వాటిని తెలుసుకుని పోషకాహార లోపాన్ని లెక్కించడానికి శాస్త్రీయ విధానం లేదని పేర్కొంది. పోషకాహార లోపాన్ని శాస్త్రీయంగా లెక్కించాలంటే బరువు, ఎత్తు గణాంకాలు అవసరమని తెలిపింది. ప్రస్తుతం అనుసరించిన విధానం గాలప్ పోల్ ఆధారంగా రూపొందించినదని తెలిపింది. కేవలం టెలిఫోన్ ద్వారా నిర్వహించిన సర్వే ఆధారంగా జనాభాను అంచనా వేశారని తెలిపింది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో యావత్తు జనాభాకు ప్రభుత్వం ఆహార భద్రత కల్పించిన విషయాన్ని ఈ నివేదిక పట్టించుకోలేదని పేర్కొంది. దీనికి సంబంధించిన సమాచారం అందుబాటులో ఉందని తెలిపింది. ప్రభుత్వం నుంచి కానీ, ఇతర మార్గాల్లో కానీ ఆహార మద్దతు లభిస్తోందా? అనే ప్రశ్నను ఈ ఒపీనియన్ పోల్‌లో అడగలేదని గుర్తు చేసింది. ఈ ఒపీనియన్ పోల్ ప్రాతినిధ్యం భారత దేశంతోపాటు, ఇతర దేశాలకు సందేహాస్పదమని పేర్కొంది. 


Updated Date - 2021-10-16T02:03:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising