ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్రిక్తతలు తగ్గినందుకు భారత్ సంతోషించాలి : చైనా

ABN, First Publish Date - 2021-04-11T23:15:08+05:30

తూర్పు లడఖ్‌లో ఉద్రిక్తతలు తగ్గాయని, ఈ సానుకూల ధోరణిని భారత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్ : తూర్పు లడఖ్‌లో ఉద్రిక్తతలు తగ్గాయని, ఈ సానుకూల ధోరణిని భారత దేశం సంతోషంగా కొనసాగించాలని చైనా సైన్యం పేర్కొంది. ఏప్రిల్ 9న ఇరు దేశాల సైనిక కమాండర్ల మధ్య జరిగిన 11వ విడత చర్చల అనంతరం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ఫిబ్రవరిలో పాంగాంగ్ సో సరస్సు ఉత్తర, దక్షిణ తీరాల నుంచి ఇరు దేశాల సైన్యాల ఉపసంహరణ గురించి పరోక్షంగా ప్రస్తావించింది. అయితే తాజా చర్చల్లో పురోగతి కనిపించలేదని సమాచారం. 


ఏప్రిల్ 9న వాస్తవాధీన రేఖ వెంబడి భారత భూభాగంవైపునగల చుసుల్‌లో భారత్, చైనా కార్ప్స్ కమాండర్ లెవెల్ 11వ విడత చర్చలు జరిగాయి. ఈ చర్చలు సుమారు 13 గంటలపాటు సాగాయి. ఈ చర్చల గురించి వివరిస్తూ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అధికార ప్రతినిధి ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. దీనిని చైనా గ్లోబల్ టెలివిజన్ నెట్‌వర్క్ ఆదివారం ప్రసారం చేసింది. 


పీఎల్ఏ అధికార ప్రతినిధి విడుదల చేసిన ఈ పత్రికా ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గడాన్ని, ప్రశాంత వాతావరణం ఏర్పడటాన్ని పాజిటివ్ ట్రెండ్‌గా చైనా సైన్యం అభివర్ణించింది. దీనిని భారత దేశం సంతోషంగా కొనసాగిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఇరు దేశాల సైన్యాలు కుదుర్చుకున్న ఒప్పందాలకు భారత్ కట్టుబడి ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేసింది. చైనా మాదిరిగానే భారత దేశం కూడా సరిహద్దుల్లో శాంతి, సామరస్యాలను కాపాడటం కోసం కృషి చేయాలని పేర్కొంది. 


ఇదిలావుండగా, 11వ రౌండ్ కార్ప్స్ కమాండర్ లెవెల్ చర్చల అనంతరం శనివారం భారత సైన్యం విడుదల చేసిన ప్రకటనలో, తూర్పు లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్, గోగ్రా, డెప్సాంగ్ ఫ్రిక్షన్ పాయింట్ల నుంచి దళాల ఉపసంహరణపై వివరంగా చర్చించినట్లు తెలిపింది. క్షేత్ర స్థాయిలో సుస్థిరతను ఉమ్మడిగా కాపాడాలని అంగీకారానికి వచ్చినట్లు పేర్కొంది. కొత్త సంఘటనలు జరగకుండా నివారించాలని, ప్రస్తుత సమస్యలను వేగంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొంది. 


అయితే ఈ చర్చల గురించి తెలిసిన విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, చైనా ప్రతినిధులు ముందుగా ఏర్పరచుకున్న ఆలోచనా ధోరణితో ఈ చర్చలకు హాజరయ్యారు. తూర్పు లడఖ్‌లోని మిగిలిన ఫ్రిక్షన్ పాయింట్ల నుంచి దళాల ఉపసంహరణపై చర్చలు ముందుకు సాగడానికి అవకాశం ఇవ్వలేదు. 


Updated Date - 2021-04-11T23:15:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising