ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Swiss bank: వరుసగా 3వ ఏడాది భారతీయ అకౌంట్ల వివరాలు

ABN, First Publish Date - 2021-10-11T23:51:14+05:30

స్విట్జర్లాండ్‌లో భారతీయుల అకౌంట్లకు సంబంధించిన మూడో సెట్ ఇండియాకు అందింది. స్విట్జర్లాండ్‌లో అకౌంట్లున్న..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్‌లో భారతీయుల అకౌంట్లకు సంబంధించిన మూడో సెట్ ఇండియాకు అందింది. స్విట్జర్లాండ్‌లో అకౌంట్లున్న భారతీయుల వివరాలను ఆ దేశం భారత్‌కు పంపడం వరుసగా ఇది మూడో సంవత్సరం. ఇరుదేశాల మధ్య ఉన్న 'ఆటోమాటిక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇన్‌పర్మేషన్' ఒప్పందం కింద ఈ వివరాలను స్విస్ అందజేసింది. 96 దేశాలకు సుమారు 33 లక్షల ఫైనాన్షియల్ అకౌంట్ల వివరాలను స్విట్జర్లాండ్ షేర్ చేసింది. ఈ ఏడాది మరో పది దేశాలతో సమాచారం పంచుకున్నట్టు ఫెడరల్ టాక్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌టీఏ) సోమవారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది. యాంటిగ్వా అండ్ బార్బుడా, అజర్‌బైజాన్, డొమినికా, ఘన, లెబనాన్, మకవు, పాకిస్థాన్, ఖతార్ దేశాలు ఇందులో ఉన్నాయి.


వరుసగా మూడో సంవత్సరం కూడా ఇండియా సమాచారం అందుకుందని, స్విస్ ఆర్థిక సంస్థల్లో పలువురు వ్యక్తులు, కంపెనీలకు చెందిన సమాచారం ఎక్స్జేంజ్ చేసినట్టు ఎఫ్‌టీఏ తెలిపింది. గత నెలలో ఈ ఎక్స్జేంజ్ జరిగిందని, మరో విడత సమాచారం 2022 సెప్టెంబర్‌లో స్విట్జర్లాండ్ షేర్ చేస్తుందని పేర్కొంది. ఆటోమేటక్ ఎక్స్జేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ (ఏఈఓఐ) కింద స్విట్జర్లాండ్ నుంచి 2019 సెప్టెంబర్‌లో భారత్ తొలిసారి సమాచారం అందుకుంది.

Updated Date - 2021-10-11T23:51:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising