ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రపంచంలో అతిపెద్ద, వేగవంతమైన వ్యాక్సినేషన్ డ్రైవ్ మనదే: నడ్డా

ABN, First Publish Date - 2021-06-21T21:50:40+05:30

భారత్‌లో చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రపంచంలోనే అతిపెద్ద, అతి వేగవంతమైన వ్యాక్సినేషన్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత్‌లో చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రపంచంలోనే అతిపెద్ద, అతి వేగవంతమైన వ్యాక్సినేషన్ డ్రైవ్ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. పద్దెనిమిదేళ్లు నిండిన వారందరికీ కేంద్రమే ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తోందని చెప్పారు. సోమవారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, రామ్‌మనోహర్ లోహియా ఆసుపత్రిలోని వ్యాక్సినేషన్ కేంద్రానికి ఇవాళ వెళ్లానని, వ్యాక్సినేషన్ డ్రైవ్ సాఫీగా సాగుతోందని చెప్పారు. ప్రజలందరికీ వేగంగా వ్యాక్సినేషన్ అందించాలనే కృతనిశ్చయంతో  కేంద్రం ముందుకు వెళ్తోందన్నారు.




టాప్-10 దేశాల్లో మనది ఏడో ర్యాంకు..

కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ను సొంతంగా తయారు చేసుకుంటూ, ట్రయిల్స్ జరుపుతున్న పది అగ్రదేశాల్లో భారత్ ఏడో ర్యాంకులో ఉందని నడ్డా తెలిపారు. తొమ్మిది నెలల్లోనే రెండు స్వదేశీ వ్యాక్సిన్లు తీసుకువచ్చిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని అన్నారు. కోవిడ్ వ్యాక్సిన్‌పై విపక్షాలు పెదవి విరిస్తూ, తప్పుదారి పట్టించే ప్రకటనలు చేస్తున్నప్పటికీ ప్రజలు చురుగ్గా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో పాల్గొని వ్యాక్సిన్ వేయించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. రామ్‌ మనోహర్ లోహియా ఆసుపత్రిని నడ్డాతో పాటు సందర్శించిన వారిలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, డిల్లీ పార్టీ చీఫ్ ఆదేశ్ కుమర్ గుప్తా, పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, ప్రతినిధి బైజయంత్ పాండ, బీజేపీ ఎంపీ అనిల్ జైన్ ఉన్నారు.

Updated Date - 2021-06-21T21:50:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising