ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జపాన్ పీఎంతో మోదీ సుదీర్ఘ టెలిఫోన్ సంభాషణ

ABN, First Publish Date - 2021-03-10T01:47:01+05:30

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో విస్తరణవాదంతో రెచ్చిపోతున్న చైనాను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఇండో-పసిఫిక్ ప్రాంతంలో విస్తరణవాదంతో రెచ్చిపోతున్న చైనాను నిలువరించేందుకు కృషి చేయాలని భారత్, జపాన్ నిర్ణయించాయి. ఇరు దేశాల ప్రధాన మంత్రులు నరేంద్ర మోదీ, యొషిహిడే సుగ మంగళవారం ఈ మేరకు నిర్ణయించారు. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డయలాగ్ సదస్సుకు ముందు వీరిద్దరూ టెలిఫోన్ ద్వారా దాదాపు 40 నిమిషాలపాటు చర్చలు జరిపారు. 


జపాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, ఇండో-పసిఫిక్ రీజియన్‌లో స్వేచ్ఛాయుత పరిస్థితులు నెలకొనేందుకు నాలుగు దేశాల క్వాడ్ గ్రూపు ద్వారానూ, భారత్, జపాన్ ద్వైపాక్షికంగానూ కృషి చేయాలని మోదీ, సుగ నిర్ణయించారు. రక్షణ, భద్రతా రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. చైనా తీరు పట్ల జపాన్ ప్రధాని సుగ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హాంగ్ కాంగ్ నుంచి తూర్పు చైనా సముద్రం వరకు చైనా ఆగడాలు మితిమీరుతున్నాయని పేర్కొన్నారు. 


ఇండో-పసిఫిక్ ప్రాంతం స్వేచ్ఛాయుతంగా ఉండటం చాలా ముఖ్యమనే విషయాన్ని మోదీ, సుగ గుర్తించారని, దీనిని సాధించేందుకు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారని ఈ ప్రకటన తెలిపింది. జపాన్-భారత్ ద్వైపాక్షిక సంబంధాలను, సహకారాన్ని పెంపొందించుకోవాలని, అదేవిధంగా జపాన్-ఆస్ట్రేలియా-ఇండియా-అమెరికా క్వాడ్రిలేటరల్ సహకారాన్ని పటిష్టం చేసుకోవాలని నిర్ణయించారని తెలిపింది. 


చైనా ఏకపక్ష చర్యలపై సుగ ఆందోళన

జపాన్-ఇండియా స్పెషల్ స్ట్రాటజిక్ అండ్ గ్లోబల్ పార్ట్‌నర్‌షిప్ కోసం భద్రత, రక్షణ, ఆర్థిక రంగాల్లో సహకరించుకోవాలని నిర్ణయించినట్లు తెలిపింది. డిజిటల్ రంగంతోపాటు ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొంది. తూర్పు, దక్షిణ చైనా సముద్రంలో యథాతథ స్థితిని మార్చేందుకు చైనా ఏకపక్షంగా ప్రయత్నిస్తోందని సుగ చెప్పారని తెలిపింది. చైనా కోస్ట్ గార్డ్ చట్టం, హాంగ్ కాంగ్, జింజియాంగ్‌లో వీఘర్ అటానమస్ రీజియన్ తదితర అంశాలపై కూడా చర్చించారని పేర్కొంది. 


క్వాడ్ దేశాలంటే...

భారత దేశం, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా కలిసి క్వాడ్ దేశాలుగా ఏర్పడ్డాయి. చైనా దూకుడును కట్టడి చేయడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దృష్టి సారించారు. క్వాడ్ గ్రూప్ సమావేశం శుక్రవారం జరిగే అవకాశం ఉంది. 


Updated Date - 2021-03-10T01:47:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising