ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ కారణంగా పెరిగిన లైంగిక హింస:యూఎన్‌

ABN, First Publish Date - 2021-04-14T07:52:28+05:30

కొవిడ్‌ మహమ్మారి కారణంగా గత ఏడాది లైంగిక హింస పెరిగిందని ఐక్యరాజ్యసమితి(యూఎన్‌) తాజాగా పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో సైన్యాలు, సాయుధ మూకలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐక్యరాజ్యసమితి, ఏప్రిల్‌ 13: కొవిడ్‌ మహమ్మారి కారణంగా గత ఏడాది లైంగిక హింస పెరిగిందని ఐక్యరాజ్యసమితి(యూఎన్‌) తాజాగా పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో సైన్యాలు, సాయుధ మూకలు.. లైంగిక హింసను ఒక యుద్ధవ్యూహంగా, రాజకీయ అణచివేతకు ఉపయోగించుకున్నాయని తెలిపింది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. మొత్తం 18 దేశాల్లో 52 సైన్యాలు లేదా సాయుధ మూకలు మహిళలపై అకృత్యాలకు పాల్పడినట్లు తమ వద్ద ధ్రువీకృత సమాచారం ఉందని ఆ నివేదికలో స్పష్టం చేసింది. ‘‘ఈ దారుణాలకు పాల్పడుతున్న వాటిలో అత్యధిక శాతం ప్రభుత్వేతర మూకలు ఉన్నాయి. ప్రతిపక్షాలు, తిరుగుబాటు బృందాలు, అల్‌ఖైదా లేదా ఇస్లామిక్‌ స్టేట్‌తో సంబంధమున్న ఉగ్రమూకలు ఎక్కువగా ఉన్నాయి. ఈ జాబితాలో ఉన్న ప్రభుత్వ సైన్యం లేదా అధికారిక పోలీసు బలగాలను ఐక్యరాజ్యసమితి శాంతి కార్యకలాపాల్లో పాల్గొనకుండా నిషేధించాం. ఈ బ్లాక్‌లి్‌స్టలో కాంగో, దక్షిన సూడాన్‌లోని ప్రభుత్వ, పోలీసు బలగాలు, సిరియా నిఘా వర్గాలు, సూడాన్‌లో సాయుధ బలగాలు ఉన్నాయి. చాలా చోట్ల మహిళల అవసరాల్ని ఆసరాగా చేసుకుని, వారిపై అత్యాచారాలకు ఒడిగడుతున్నారు.’’ అని ఆ నివేదికలో యూఎన్‌ పేర్కొంది. 

Updated Date - 2021-04-14T07:52:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising