ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హర్యానా ఎమ్మెల్యే ఇంటిపై ఐటీ దాడులు

ABN, First Publish Date - 2021-02-25T16:27:31+05:30

కేంద్రం ఒత్తిడితో మరో స్వతంత్ర ఎమ్మెల్యేపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు గురువారం ఆకస్మిక దాడులు చేశారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 రైతుల ఆందోళనకు మద్ధతు ఇచ్చిన ఫలితం

రోహతక్ (హర్యానా): కేంద్రం ఒత్తిడితో మరో స్వతంత్ర ఎమ్మెల్యేపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు గురువారం ఆకస్మిక దాడులు చేశారు. కేంద్రం ప్రవేశ పెట్టిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతుల ఆందోళనకు హర్యానా రాష్ట్రానికి చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే బాలరాజు కుందూ మద్ధతు ఇచ్చారు. రైతుల ఉద్యమంలో మేహం ఎమ్మెల్యే అయిన బాలరాజ్ పాల్గొన్నారు. దీంతో గురువారం బాలరాజ్ కుచెందిన కార్యాలయాలు, ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. రోహతక్ లోని సెక్టార్ 14. గురుగావ్ లోని అతని ఇళ్లు, హిసార్ హంసీలోని అల్లుడి ఇల్లు, రోహతక్ లోని అతని ఇద్దరు సోదరుల ఇళ్లు, ఎమ్మెల్యే సన్నిహితులకు చెందిన 30 ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడి చేసి తనిఖీలు జరిపారు. రాజకీయ కక్షతోనే ఐటీ అధికారులు దాడులు చేసి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారని ఎమ్మెల్యే కార్యాలయ అధికారి దేవేందర్ సింగ్ ఆరోపించారు.రోహతక్ జిల్లాపరిషత్ మాజీ ఛైర్మన్  అయిన బాలరాజ్ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. 

Updated Date - 2021-02-25T16:27:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising