ప్రత్యక్ష విచారణ పేరిట.. వేధిస్తామంటే ఊరుకోం
ABN, First Publish Date - 2021-07-24T08:19:51+05:30
సోషల్ మీడియా పోస్టుకు సంబంధించిన వ్యవహారంలో ట్విటర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరికి ఉత్తరప్రదేశ్ పోలీసులు జారీచేసిన నోటీసును కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది.
- దురుద్దేశంతోనే సెక్షన్ 41(ఏ) ప్రయోగం
- పోలీసులకు కర్ణాటక హైకోర్టు స్పష్టీకరణ
- ట్విటర్ ఇండియా ఎండీపై నోటీసు కొట్టివేత
బెంగళూరు, జూలై 23 (ఆంధ్రజ్యోతి) : సోషల్ మీడియా పోస్టుకు సంబంధించిన వ్యవహారంలో ట్విటర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరికి ఉత్తరప్రదేశ్ పోలీసులు జారీచేసిన నోటీసును కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. మతపరంగా అతిసున్నితమైన అంశాలపై ఒకరు ట్విటర్‌లో వీడియో అప్‌లోడ్ చేసిన కేసులో నేరుగా విచారణకు రావాలంటూ సీఆర్‌పీసీ సెక్షన్ 41(ఏ) కింద పోలీసులు ఈ నోటీసు జారీచేశారు. అయితే, ప్రత్యక్ష హాజరును తప్పనిసరి చేస్తున్న ఈ సెక్షన్‌ను.. పరోక్ష విచారణను అనుమతించే సీఆర్‌పీసీ సెక్షన్ 160గా నోటీసులో మారుస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. సెక్షన్ 41(ఏ)ను వేధింపులకు ఒక ఆయుధంగా వాడతామంటే అనుమతించేది లేదని స్పష్టం చేసింది. అవసరం అనుకొంటే సెక్షన్ 160 కింద వర్చువల్‌గానే మహేశ్వరిని కార్యాలయంలోనో, నివాసంలోనో ప్రశ్నించవచ్చునని పోలీసులకు కోర్టు సూచించింది. బెంగళూరులో ఉంటున్న మహేశ్వరికి గత నెల 21న ఉత్తరప్రదేశ్ పోలీసులు ఈ నోటీసు పంపారు.
Updated Date - 2021-07-24T08:19:51+05:30 IST