ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికల వేళ.. 200 కేజీల జిలేబీలు, 1050 సమోసాల సీజ్!

ABN, First Publish Date - 2021-04-11T22:04:13+05:30

ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు మద్యం, డబ్బులు పంపిణీ చేయడం గురించి చూస్తున్నాం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉన్నావో: ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు మద్యం, డబ్బులు పంపిణీ చేయడం గురించి చూస్తున్నాం, వింటున్నాం. కానీ ఈ జిలేబీలు, సమోసాలు ఏంటి మరీ విచిత్రం కాకపోతేనూ.. అనుకోకండి. ఇది నిజమే. పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని ఓటర్లను ప్రలోభపెట్టేందుకు సిద్ధం చేసిన వీటిని పోలీసులు సీజ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావోలో జరిగిందీ ఘటన. హసన్‌గంజ్‌లో ఓటర్లకు పంచి పెట్టేందుకు ఓ అభ్యర్థి పెద్ద ఎత్తున జిలేబీలు, సమోసాలు సిద్ధం చేశాడు. 


ప్రత్యర్థులు ఊరుకుంటారా? ఎవరో ఈ సమచారాన్ని పోలీసులకు అందించారు. వారు వెంటనే రంగంలోకి దిగి సదరు అభ్యర్థి ఇంట్లో వాలిపోయారు. రెండు క్వింటాళ్ల జిలేబీలు, 1050 సమోసాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు, ఎల్‌పీజీ సిలిండర్లు, పిండి, నెయ్యితోపాటు సమోసా, జిలేబీలు తయారీలో ఉపయోగించే ఇతర పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. కొవిడ్ నిబంధనల ఉల్లంఘన, ఎన్నికల నియమాళిని ఉల్లంఘించడం వంటి కేసులు నమోదు చేసి 10 మందిని అరెస్ట్ చేశారు .  


ఉత్తరప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు నాలుగు దశల్లో జరగనున్నాయి. ఈ నెల 15న తొలి దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. చివరి విడత ఈ నెల 29న జరగనుంది. మే 2న ఫలితాలు వెల్లడికానున్నాయి.


Updated Date - 2021-04-11T22:04:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising