ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్ జనాభాపై వ్యాఖ్యలతో ట్రోల్స్‌లో ఇరుక్కున్న ఇమ్రాన్ ఖాన్

ABN, First Publish Date - 2021-08-04T15:56:41+05:30

పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ట్రోల్స్‌లో ఇరుక్కున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ట్రోల్స్‌లో ఇరుక్కున్నారు. పాకిస్థాన్ ప్రజలను ఉద్దేశించి ఓ టెలికాస్ట్‌లో ఆయన మాట్లాడుతూ భారత దేశ జనాభా గురించి మాట్లాడుతూ తడబడ్డారు. భారత దేశ జనాభా 1 బిలియన్ 300 కోట్లు అని చెప్పి, నెటిజన్లకు మంచి అవకాశం ఇచ్చారు. 


నెటిజన్లు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ ట్రోల్స్‌తో ఇమ్రాన్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు. ఆయనకు భారత దేశ జనాభా ఎంతో తెలియదని, అంతేకాకుండా ఒక బిలియన్‌లో ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలియదని ఎగతాళి చేస్తున్నారు. జపాన్, జర్మనీ ఇరుగు, పొరుగున ఉన్నాయని, ఈ రెండు దేశాలకు ఉమ్మడి సరిహద్దు ఉందని ఇమ్రాన్ గతంలో చెప్పారని గుర్తు చేస్తున్నారు. ఆయన ఏమైనా చెప్పగలరని వ్యాఖ్యానిస్తున్నారు. 


టెస్ట్ క్రికెట్, ప్రపంచం మధ్య పోలిక తెస్తూ ఇమ్రాన్ ఖాన్ మాట్లాడినపుడు ఈ పొరపాటు దొర్లింది. 1 బిలియన్ 300 కోట్లు జనాభాగల భారత దేశంతో 4 లేదా 5 మిలియన్ల జనాభాగల వేరొక దేశంతో పోల్చుతూ ఇమ్రాన్ మాట్లాడినట్లు ఈ వీడియోలో కనిపించింది. నాలుగు లేదా ఐదు మిలియన్ల మంది ఉన్న న్యూజిలాండ్, ఒక బిలియన్ 300 కోట్ల జనాభాగల భారత దేశం అని చెప్తూ, ఐసీసీ టెస్ట్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో న్యూజిలాండ్ గెలిచిందని ప్రశంసించారు. 


2019 గణాంకాల ప్రకారం భారత దేశ జనాభా 136 కోట్లు.


Updated Date - 2021-08-04T15:56:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising