ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pakistan:దేవాలయంపై దాడి ఘటనపై సుప్రీం విచారణ

ABN, First Publish Date - 2021-08-06T13:26:10+05:30

పాకిస్థాన్‌ దేశంలోని పంజాబ్‌ ప్రావిన్స్‌లో సిద్ధి వినాయక ఆలయంపై దుండగుల దాడి ఘటనపై ఆ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఆలస్యంగా ఖండన

లాహోర్ : పాకిస్థాన్‌ దేశంలోని పంజాబ్‌ ప్రావిన్స్‌లో సిద్ధి వినాయక ఆలయంపై దుండగుల దాడి ఘటనపై ఆ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. దేవాలయంపై దాడి ఘటనపై పాక్ హిందూ కౌన్సిల్ చీఫ్ ప్యాట్రన్ రమేష్ కుమార్ వాంక్వానీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్ ను కలిశారు.ఈ ఘటనపై శుక్రవారం (నేడు) విచారణ చేపట్టనున్నందున విచారణకు హాజరు కావాలని పంజాబ్ ప్రావిన్స్ చీఫ్ సెక్రటరీ, పోలీసు చీఫ్ లను ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు.రహీంయార్‌ ఖాన్‌ జిల్లా భోంగ్‌ నగరంలో బుధవారం రాత్రి ఆలయంపై దుండగులు ఇనుప రాడ్లు, కర్రలు, కట్టెలు తీసుకొని  దాడికి పాల్పడ్డారు.


ఈ ఘటనపై భారతదేశం స్పందించి పాకిస్థాన్ దేశంలోని మైనారిటీల భద్రతకు భరోసా కల్పించాలని కోరింది. దీంతో స్పందించిన పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఆలయంపై జరిగిన దాడిని ఖండించారు. ఆలయంపై దాడికి పాల్పడిన దోషులందరినీ అరెస్టు చేయాలని తాను ఐజీని ఆదేశించడంతో పాటు ఆలయాన్ని పునరుద్ధరిస్తామని ఇమ్రాన్ ఖాన్ ఆలస్యంగా ట్వీట్ చేశారు. 


Updated Date - 2021-08-06T13:26:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising