ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాక్ ప్రధాని టంగ్ స్లిప్ అయ్యారు.. పట్టించుకోవద్దు: పాక్ మంత్రి

ABN, First Publish Date - 2021-06-28T00:13:09+05:30

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గతంలో ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను అమరుడని సంబోధించడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గతంలో ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను అమరుడని సంబోధించడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. తాలిబన్లకు పాక్ మద్దతిస్తుండటం, ఆఫ్ఘానిస్తాన్ నుంచి అమెరికా సేనలు వెనుదిరుగుతున్న నేపథ్యంలో అప్పటి ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు తరచూ చర్చల్లో నిలుస్తున్నాయి. ఆ వ్యాఖ్యల పర్యవసానాలు, ఆఫ్ఘనిస్థాన్‌పై పాక్ ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు వివిధి కోణాల్లో చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్ సమాచార ప్రసార శాఖ మంత్రి ఫవాద్ చౌదరి ఇమ్రాన్ కామెంట్లకు అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేందుకు తాజాగా ప్రయత్నించారు. ఇమ్రాన్ ఖాన్ పార్లమెంటులో నోరు జారి బిన్ లాడెన్‌ను అమరుడని సంబోధించారని చెప్పుకొచ్చారు. ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా 2011లో ఓ సీక్రెట్ సైనిక ఆపరేషన్ ద్వారా అంతమొందించిన విషయం తెలిసిందే. అబోటాబాద్‌లో ఓ భారీ భవనంలో ఒసామా నివాసం ఉంటున్నాడని పసిగట్టిన అప్పటి ఒబామా ప్రభుత్వం ప్రత్యేక సైనిక దళాన్ని ఆ భవనంలోకి పంపించి ఒసామాను మట్టుబెట్టి..9/11 దాడులకు ప్రతీకారం తీర్చుకుంది. 

Updated Date - 2021-06-28T00:13:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising