ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Maharashtra: కరోనా వ్యాప్తి చెందకుండా ఆంక్షలు విధించండి

ABN, First Publish Date - 2021-08-28T17:53:26+05:30

మహారాష్ట్రలో పండుగల సందర్భంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించాలని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆదేశాలు

ముంబై (మహారాష్ట్ర): మహారాష్ట్రలో పండుగల సందర్భంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ శనివారం ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్రలో ఇటీవల జరిగిన కొన్ని ఈవెంట్ల వల్ల కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిందని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) ఆందోళన వ్యక్తం చేసింది. మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య పెరిగిన దృష్ట్యా పండుగల సందర్భంగా వైరస్ ప్రబలకుండా మరిన్ని ఆంక్షలు విధించాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది. 


ఈ మేర కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ మహారాష్ట్ర అధికారులకు లేఖ రాశారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఆగస్టు 29న జరగనున్న దహీహండీ వేడుకలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే ప్రకటించారు. మహారాష్ట్ర సర్కారు దహీహండీ పండుగపై నిషేధాన్ని ఎత్తివేసి, ఆంక్షలతో పండుగ జరుపుకునేందుకు అనుమతించాలని బీజేపీ అధికార ప్రతినిధి రాం కదమ్ డిమాండ్ చేశారు.  దేశీయ విమాన ప్రయాణం కోసం ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకునే ముందు కొవిడ్ మార్గదర్శకాలు పాటించాలని కేంద్రం సూచించింది. టెస్టు, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేట్, ఆంక్షల అమలుతో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాలని కేంద్ర ఆరోగ్యశాఖ మహారాష్ట్ర సర్కారుకు సూచించింది.  


Updated Date - 2021-08-28T17:53:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising