ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెన్నైకి భారీ వర్ష సూచన

ABN, First Publish Date - 2021-11-17T00:24:28+05:30

నగరంలో నవంబరు 18న భారీ వర్షాలు కురుస్తాయని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై : నగరంలో నవంబరు 18న భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. చెన్నై, కాంచీపురం, తిరువళ్ళూరు, రాణీపేట జిల్లాల్లో గురువారం భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ, రెడ్ అలర్ట్ ప్రకటించింది. వెల్లూరు, తిరువణ్ణామలై, కళ్లకురిచి, విల్లుపురం, మయిలదుత్తురాయ్, డెల్టా జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయని చెప్పింది. 


చెన్నై రీజనల్ మెటియరలాజికల్ సెంటర్ విడుదల చేసిన ప్రకటనలో ఆగ్నేయ బంగాళాఖాతం, నార్త్ అండమాన్ సీ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్లు తెలిపింది. ఇది ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉందని, ఇది పశ్చిమ దిశగా కదిలి, నవంబరు 18న పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి సమీపంలోని నైరుతి బంగాళాఖాతానికి చేరుకుని, దక్షిణ ఆంధ్ర ప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరాల వైపు పయనించే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావం ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడులలో ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు వివరించింది. 


బుధ, గురువారాల్లో తమిళనాడు వ్యాప్తంగా వర్షపాతం అధికంగా ఉంటుందని తెలిపింది. శుక్ర, శనివారాల్లో చెదురుమదురు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. నవంబరు 17-18 తేదీల్లో ఆరంజ్ అలెర్ట్ ప్రకటించింది. 


Updated Date - 2021-11-17T00:24:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising