ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్హత ఉంటే వెంటనే కొవిడ్ టీకా వేయించుకోండి

ABN, First Publish Date - 2021-04-08T13:59:03+05:30

అర్హత ఉంటే ప్రాణాంతక కరోనా వైరస్ బారి నుంచి రక్షణ పొందేందుకు కొవిడ్ టీకా వేయించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీకా రెండో డోసు వేయించుకున్న ప్రధాని మోదీ పిలుపు

న్యూఢిల్లీ : అర్హత ఉంటే ప్రాణాంతక కరోనా వైరస్ బారి నుంచి రక్షణ పొందేందుకు కొవిడ్ టీకా వేయించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం కోరారు. గురువారం ఉదయం ఢిల్లీలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో ప్రధాన నరేంద్రమోదీ రెండవ డోస్ కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. మార్చి 1వతేదీన మోదీ మొదటి డోసు కొవిడ్ టీకా వేయించుకున్నారు. తన మొదటి డోసు తీసుకున్నప్పుటిలాగా కాకుండా మోదీ ఈ సారి ఫేస్ మాస్కు ధరించి టీకా వేయించుకున్నారు.


 ‘‘కరోనా వైరస్ ను ఓడించడానికి టీకా మన వద్ద ఉన్న మార్గాల్లో ఒకటని, అందుకే అర్హులైతే మీరు కొవిడ్ టీకా తీసుకోండి’’ అని మోదీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లింక్ ను కొవిడ్ వెబ్ సైట్, టీకా నమోదు కోసం ఏర్పాటైన పోర్టల్ లో పంచుకున్నారు. భారత్ బయోటెక్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ ను ప్రధాని మోదీ తీసుకున్నారు. ప్రధాని మోదీకి ఇద్దరు నర్సులు కొవిడ్ టీకా వేశారు. ప్రధాన నర్సు పి నివేదా మోదీ చేతిని పట్టుకోగా, మరో నర్సు నిషా శర్మ వ్యాక్సిన్ వేశారు.

Updated Date - 2021-04-08T13:59:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising