ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐఏఎస్‌ రోహిణి సింధూరికి కోర్టు హెచ్చరిక

ABN, First Publish Date - 2021-08-01T16:34:39+05:30

మైసూరులోని సర్వే నెంబరు 4కు సంబంధించి కురుబరహళ్లి, గౌడహళ్లి, ఆలనహళ్లి భూవివాదంపై కోర్టు ఉల్లంఘనలతో ఐఏఎస్‌ అధికారి రోహిణిసింధూరికి క్లిష్ట పరిస్థితి ఎదురైంది. ఆగస్టు 1

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

           - కోర్టు ఆదేశాలు పాటించాలంటూ సూచన


బెంగళూరు: మైసూరులోని సర్వే నెంబరు 4కు సంబంధించి కురుబరహళ్లి, గౌడహళ్లి, ఆలనహళ్లి భూవివాదంపై కోర్టు ఉల్లంఘనలతో ఐఏఎస్‌ అధికారి రోహిణిసింధూరికి క్లిష్ట పరిస్థితి ఎదురైంది. ఆగస్టు 13లోగా సంబంధిత వ్యక్తుల పేరిట భూములు మార్చకుంటే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని కోర్టు హెచ్చరించింది. సర్వే నెంబరు 4 పరిధిలోని భూముల వివాదాన్ని పరిష్కరించి నివాసుల సమస్యను వెంటనే తీర్చాలని హైకోర్టు సూచించింది. కోర్టు ఉత్తర్వులు పాటించలేదని భూముల యజమానులు ఐఏఎస్‌ అధికారి రోహిణి సింధూరిపై క్రిమినల్‌ కేసు రూపంలో కోర్టు ఉల్లంఘన పిటీషన్‌ దాఖలు చేశారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు ధర్మాసనం నేరుగా విచారణకు హాజరు కావాలని రోహిణి సింధూరికి నోటీసు జారీ చేసింది. శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రోహిణి సింధూరి విచారణలో పాల్గొన్నారు. ఇదే సందర్భంలో ఆగస్టు 13లోగా వివాదాన్ని పరిష్కరించకుంటే తీవ్ర పరిణామాలు చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. రోహిణి సింధూరితోపాటు తహసీల్దార్‌ రక్షిత్‌లపైనా ధర్మాసనం మండిపడింది. 

Updated Date - 2021-08-01T16:34:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising