ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజకీయాల్ని మార్చేది నా సోదరిణులే: యూపీలో అధికారంపై ప్రియాంక విశ్వాసం

ABN, First Publish Date - 2021-12-23T01:11:20+05:30

‘అమ్మాయిని.. పోరాడతాను’ అనే నినాదం విస్తృతం ప్రచారం చేస్తున్నారు. దీనికి ఆశించిన ఫలితం కూడా వచ్చింది. కాగా, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మహిళలు లక్ష్యంగా హామీలు గుప్పించారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లఖ్‌నవూ: ‘అమ్మాయిని.. పోరాడతాను’ అనే నినాదంతో ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ప్రియాంక గాంధీ వాద్రా.. ఉత్తరప్రదేశ్ మహిళలే కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. తనతో సోదరిణులు ఉన్నారని, వారే ఈ రాజకీయాల్ని మార్చేస్తారని ఆమె పేర్కొన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ప్రియాంక ఈ వ్యాఖ్యలు చేశారు.


‘‘నాతో సోదరిణులు ఉన్నారు. వాళ్లే రాజకీయాల్లో కీలకమైన మార్పుల్ని తీసుకువస్తారు’’ అని ప్రియాంక అన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రియాంక కొత్త స్ట్రాటజీతో వెళ్తున్నారు. మహిళలు లక్ష్యంగా ఆమె పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా తీసుకువచ్చిన ‘అమ్మాయిని.. పోరాడతాను’ అనే నినాదం విస్తృతం ప్రచారం చేస్తున్నారు. దీనికి ఆశించిన ఫలితం కూడా వచ్చింది. కాగా, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మహిళలు లక్ష్యంగా హామీలు గుప్పించారు. బాలికా విద్యార్థులకు ఉచిత స్కూటీలు, సెల్‌ఫోన్లతో పాటు మహిళలకు సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు, బస్సుల్లో 50 శాతం చార్జీల తగ్గింపు, నెల నెలా భృతి లాంటివి పెట్టారు. అన్నింటికంటే ముఖ్యంగా కాంగ్రెస్ తరపున 40 శాతం టికెట్లు మహిళలకే కేటాయించారు. ఇది మంచి ఫలితాన్ని ఇస్తుందని ప్రియాంకతో పాటు కాంగ్రెస్ వర్గీయులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-12-23T01:11:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising