ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్యారీ బ్యాగ్ కొనమని ఒత్తిడి చేసిన pizza outlet...

ABN, First Publish Date - 2021-11-18T18:19:45+05:30

క్యారీ బ్యాగ్ కొనమని ఒత్తిడి చేసిన పిజ్జాహౌస్‌కు వినియోగదారుల ఫోరం జరిమానా విధించిన ఉదంతం హైదరాబాద్ నగరంలో వెలుగుచూసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వినియోగదారుల ఫోరం జరిమానా

హైదరాబాద్:  క్యారీ బ్యాగ్ కొనమని ఒత్తిడి చేసిన పిజ్జాహౌస్‌కు వినియోగదారుల ఫోరం జరిమానా విధించిన ఉదంతం హైదరాబాద్ నగరంలో వెలుగుచూసింది.హైదరాబాద్‌లోని పిజ్జా అవుట్‌లెట్ కస్టమర్‌ని క్యారీ బ్యాగ్ కొనమని ఒత్తిడి చేసినందుకు రూ.11,000 జరిమానాను చెల్లించాలని వినియోగదారుల ఫోరం ఆదేశించింది. హైదరాబాద్‌లో తన లోగోతో కూడిన క్యారీ బ్యాగ్‌ను రూ.7.62కు కొనుగోలు చేయమని పిజ్జా అవుట్‌లెట్‌ ఒత్తిడి చేసింది.దీంతో కె మురళీ కుమార్ అనే విద్యార్థి పిజ్జా అవుట్‌లెట్‌పై ఫిర్యాదు చేస్తూ వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు.ఫిర్యాదుదారు 2019 సెప్టెంబరు 16న పిజ్జా టేక్‌అవేలో ఆర్డర్ చేశారు.



పిజ్జా అవుట్ లెట్ బ్రాండెడ్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌కి అదనంగా రూ.7.62 వసూలు చేసింది.పిజ్జా అవుట్‌లెట్  క్యారీ బ్యాగ్  పేరిట అదనంగా డబ్బు వసూలు చేసి, తనను వేధించిందని మురళీకుమార్ ఆరోపించాడు. అయితే పిజ్జా అవుట్‌లెట్ అన్ని ఆరోపణలను ఖండించింది.రెండు సంవత్సరాల సుదీర్ఘ విచారణ తర్వాత ఫోరమ్ వినియోగదారునికి రూ.11,000 చెల్లించాలని అవుట్‌లెట్‌ను ఆదేశించింది.

Updated Date - 2021-11-18T18:19:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising