ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Taliban attack: ఆఫ్ఘనిస్తాన్‌లో 100 మంది పౌరుల మృతి

ABN, First Publish Date - 2021-07-23T13:16:51+05:30

ఆప్ఘనిస్థాన్ దేశంలోని కందహార్ ప్రావిన్సు స్పిన్ బోల్డాక్ జిల్లాలో ఉగ్రవాదులు పౌరుల ఇళ్లపై మెరుపుదాడికి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కందహార్(ఆప్ఘనిస్థాన్): ఆప్ఘనిస్థాన్ దేశంలోని కందహార్ ప్రావిన్సు స్పిన్ బోల్డాక్ జిల్లాలో ఉగ్రవాదులు పౌరుల ఇళ్లపై మెరుపుదాడికి పాల్పడ్డారు. తాలిబాన్ ఉగ్రవాదులు ఇళ్లపై కాల్పులు జరపడంతోపాటటు ఇళ్లను దోచుకున్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో 100 మంది పౌరులు మరణించారని ఆఫ్ఘాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి మీర్వైస్ స్టానెకాయ్ చెప్పారు. తాలిబాన్లు స్పిన్ బోల్డాక్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముష్కరులు గృహాలు దోచుకుంటూ కాల్పులకు తెగబడ్డారని వీడియో ఫుటేజీలో వెల్లడైంది.ఉగ్రవాదులు మోటారు బైకులపై సంచరిస్తూ మారణకాండ సాగించారు.ఓ ఇంటిపై తాలిబాన్ జెండాలను ఎగురవేశారు. తాలిబాన్లు ఈద్ ముందురోజు కందహార్ ప్రావిన్షియల్ కౌన్సిల్ సభ్యుడిని బయటకు తీసుకువెళ్లి కాల్చి చంపారు. స్పిన్ బోల్డాక్ ప్రాంతంలోని నేలపై పౌరుల మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. 


Updated Date - 2021-07-23T13:16:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising