ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Firozabad: డెంగీ, వైరల్ జ్వరాలతో వణుతున్న జనం

ABN, First Publish Date - 2021-09-06T17:10:32+05:30

డెంగీ, వైరల్ జ్వరాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల ప్రజలను వణికిస్తున్నాయి....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫిరోజాబాద్ (ఉత్తరప్రదేశ్): డెంగీ, వైరల్ జ్వరాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల ప్రజలను వణికిస్తున్నాయి.ఫిరోజాబాద్ జిల్లాలో 105 మందికి డెంగీ, వైరల్ జ్వరాలు సోకాయి.పిల్లలను వణికిస్తున్న ఈ జ్వరాలు మధుర జిల్లాతోపాటు యూపీలోని తూర్పు ప్రాంతంలోనూ వ్యాపిస్తున్నాయి.అడెస్ ఈజిప్ట్ జాతికి చెందిన ఆడ దోమల వ్యాప్తి వల్ల డెంగీ, గన్యా, వైరల్, జికా జ్వరాలు ప్రబలుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.యూపీలోని ఫిరోజాబాద్ జిల్లాలో 105 మందికి డెంగీ, వైరల్ ఫీవర్ కేసులు నమోదయ్యాయి.డెంగీ, వైరల్ జ్వరాల వల్ల ఇప్పటివరకు 51 మంది మరణించారు.


జ్వరాలు ప్రబలిన ప్రాంతాల్లో నోడల్ అధికారులు సుధీర్ కుమార్ బొబ్డే సుదామా నగర్, ఐలాన్ నగర్ ప్రాంతాల్లో సందర్శించి ప్రజల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని దోమలు ప్రబలకుండా చూడాలని అధికారులు ప్రజలకు సూచించారు.ఫిరోజాబాద్ జిల్లాలో దోమల నివారణకు గంబూసియా చేపలను చెరువుల్లో వదిలారు.1-8 తరగతుల విద్యార్థులకు సెప్టెంబరు 16వతేదీ వరకు సెలవులు ప్రకటించారు.బల్లియాలో 25 శాతం వైరల్ జ్వరాల కేసులు పెరిగాయి.


ప్రయాగరాజ్ లో 170 మందికి జ్వరాలు సోకడంతో వారిని మోతీలాల్ నెహ్రూ ఆసుపత్రికి తరలించారు.ప్రయాగరాజ్ లో 30 డెంగీ కేసులు నమోదైనాయి.డెంగీ నివారణకు చర్యలు తీసుకునేందుకు కేంద్రం పంపిన ఐదుగురు సభ్యుల కేంద్ర బృందం ఫిరోజాబాద్ లో పర్యటిస్తోంది.జ్వర పీడితులకు సత్వర వైద్యం అందించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వైద్యాధికారులను ఆదేశించారు.


Updated Date - 2021-09-06T17:10:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising