ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీకి ధన్యవాదాలు చెప్తూ కెనడాలో భారీ కటౌట్లు

ABN, First Publish Date - 2021-03-11T20:08:35+05:30

కెనడావాసులు భారత దేశానికి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టొరంటో : కెనడావాసులు భారత దేశానికి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు చెప్తున్నారు. కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రుడు విజ్ఞప్తి మేరకు కోవిడ్-19 వ్యాక్సిన్‌ను అందజేసినందుకు ధన్యవాదాలు చెప్తూ టొరంటోలో భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. గ్రేటర్ టొరంటో ఏరియాలో ఏర్పాటు చేసిన ఈ కటౌట్లకు ఇండో-కెనడియన్ కమ్యూనిటీ గ్రూప్ స్పాన్సర్ చేసింది. 


భారత దేశం, కెనడా జాతీయ జెండాల నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బొమ్మను ఈ కటౌట్లపై ప్రచురించారు. ‘‘ధన్యవాదాలు, భారత దేశం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. కెనడా-భారత దేశం మైత్రి కలకాలం నిలవాలి’’ అని వీటిపై రాశారు. 


గ్రేటర్ టొరంటో ఏరియాలో బుధవారం తొమ్మిది కటౌట్లను ఏర్పాటు చేశారు. బ్రాంప్టన్‌లో సోమవారం మరొక నాలుగు కటౌట్లను ఏర్పాటు చేయనున్నట్లు ఇండో-కెనడియన్ కమ్యూనిటీ గ్రూప్ ప్రతినిధులు తెలిపారు. 


ఈ కటౌట్లను ఏర్పాటు చేసిన కెనడా హిందూ ఫోరం అధ్యక్షుడు రావు యండమూరి మాట్లాడుతూ, కెనడా, భారత దేశం మధ్య సహజ స్నేహ సంబంధాలను గట్టిగా చెప్పడమే తమ లక్ష్యమని తెలిపారు. కెనడాకు కోవిడ్-19 వ్యాక్సిన్లను భారత దేశం పంపించిన విషయాన్ని చాటి చెప్పడం కోసమే వీటిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 


కెనడాకు కోవిషీల్డ్ వ్యాక్సిన్

మన దేశంలో తయారైన కోవిషీల్డ్ వ్యాక్సిన్ గత బుధవారం కెనడాకు చేరుకుంది. ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం రెండు మిలియన్ల కోవిడ్-19 వ్యాక్సిన్ల డోసులను కెనడాకు పంపిస్తారు. ఈ వ్యాక్సిన్లు మే నెల రెండో వారానికల్లా కెనడా చేరుకుంటాయని తెలుస్తోంది. 


Updated Date - 2021-03-11T20:08:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising