ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రమాణ స్వీకారం తర్వాత హుబ్లీకి..

ABN, First Publish Date - 2021-07-30T18:00:22+05:30

ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత తొలి సారి హుబ్లీ విమానాశ్రయానికి విచ్చేసిన బసవరాజ బొమ్మైకు గురువారం ఘనస్వాగతం లభించింది. విధానపరిషత్‌ సభాపతి బసవరా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- తల్లిదండ్రుల సమాధులకు మొక్కి సీఎం పూజలు 

- పార్టీ శ్రేణుల ఘనస్వాగతం


బెంగళూరు: ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత తొలి సారి హుబ్లీ విమానాశ్రయానికి విచ్చేసిన బసవరాజ బొమ్మైకు గురువారం ఘనస్వాగతం లభించింది. విధానపరిషత్‌ సభాపతి బసవరాజ హొరట్టి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు అందజేశారు. అనంతరం హుబ్లీ అమరగోళలోని తలిదండ్రులు ఎస్‌ఆర్‌.బొమ్మై, గంగమ్మ సమాధులకు మొక్కి ప్రదిక్షణలు చేశారు. సమాధులకు ప్రత్యేక పూజలు చేసి శ్రద్ధాంజలి ఘటించారు. పిదప బాళెహొన్నూరులోని రంభాపురి పీఠాధిపతి డా.వీర సోమేశ్వర శివాచార్య స్వామీజీని కలిసి ఆశీర్వాదాలు అందుకున్నారు. హుబ్లీ నగరాని కి చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్‌ నేతలతో కొద్దిసేపు సమావేశమయ్యారు. సీఎంను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు అమృత దేశాయి, తాజా మాజీ మంత్రి శివరాం హెబ్బార్‌, రాష్ట్ర పట్టు మండలి అధ్యక్షురాలు సవితా అమరశెట్టి, ధార్వాడ కెపిసి బ్యాంకు అధ్యక్షుడు మల్లికార్జున హొరకేరి తదితరులున్నారు. హుబ్లిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఉత్తర కన్నడ జిల్లాలోని వరదపీడిత ప్రాంతాల్లో పర్యటించేందుకు ఆయన బయల్దేరి వెళ్ళారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని అతిపెద్ద జంటనగరమైన హుబ్లీ-ధార్వాడ సమస్యల్నింటినీ పరిష్కరించి సర్వతోముఖాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తానని సీఎం ప్రకటించారు. హుబ్లీ తనకెంతో ఇష్టమైన నగరమన్నారు. తన విద్యావ్యాసంగమంతా ఇక్కడే సాగిందని తనకు అపారసంఖ్యలో అభిమానులు స్నే హితులున్నారని సీఎం తెలిపారు. ముఖ్యమంత్రి హోదాలో హుబ్లీకి వస్తానని తాను ఊహించలేదన్నారు. అధిష్టానం పెద్దలు, మాజీ సీఎం యడియూరప్ప ఆశీస్సులతోనే తనకు పదవి దక్కిందన్నారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి వంటి హేమా హేమీలున్న హుబ్లీ-ధార్వాడలలో పార్టీ మరింత బలోపేతమైందన్నారు. కేబినెట్‌లో చేరబోనంటూ సీనియర్‌ నేత జగదీష్‌ శెట్టర్‌ చేసిన ప్రకటనను ప్రస్తావించగా బహుశా అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం కావచ్చునని దీనిపై ఆయనతో త్వరలోనే చర్చిస్తానన్నారు. సీనియర్లందరినీ కలుపుకుని ముందుకు సాగుతానని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 


Updated Date - 2021-07-30T18:00:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising