ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంబులెన్స్ కోసం ఎదురుచూసి, ఆసుపత్రిలో చరిత్రకారుని కన్నుమూత!

ABN, First Publish Date - 2021-04-13T11:51:02+05:30

ప్రముఖ చరిత్ర కారుడు, పద్మశ్రీ యోగేష్ ప్రవీణ్ కన్నుమూశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: ప్రముఖ చరిత్ర కారుడు, పద్మశ్రీ యోగేష్ ప్రవీణ్ కన్నుమూశారు. ఆయన యూపీలోని లక్నోలో చరిత్రకారునిగా ఎంతో పేరుపొందారు. గత ఏడాది యోగేష్ ప్రవీణ్ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను బలరామ్‌పూర్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా, అక్కడి వైద్యులు ఆయనను పరీక్షించి మృతి చెందారని తెలిపారు. 


చరిత్రకారుడు యోగేష్ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం అనారోగ్యం పాలయిన ఆయనను ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు అంబులెన్స్ కోసం ఎదురు చూశామన్నారు. తీవ్రమైన జ్వరం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో అంబులెన్స్ కోసం ఫోను చేశామని, రెండు గంటలు గడచినా అంబులెన్స్ రాలేదని ఆరోపించారు. దీంతో ప్రైవేటు వాహనంలోనే యోగేష్ ప్రవీణ్‌ను ఆసుపత్రికి తీసుకు వెళ్లామని, అక్కడి వైద్యులు యోగేష్‌ను పరీక్షించి, అప్పటికే మృతిచెందారని తెలిపారన్నారు. కాగా యోగేష్ ప్రవీణ్ మృతికి పలువురు నేతలు, ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

Updated Date - 2021-04-13T11:51:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising